కుట్ర చేసినట్టు ఆధారాలుంటే జైలుకు పంపించండి : కేసీఆర్‌కు ఉత్తమ్ సవాల్

కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న తలపెట్టిన సడక్ బంద్‌కి అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 6:06 PM IST
కుట్ర చేసినట్టు ఆధారాలుంటే జైలుకు పంపించండి : కేసీఆర్‌కు ఉత్తమ్ సవాల్
ఉత్తమ్ కుమార్, కేసీఆర్
  • Share this:
ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ఆర్టీసీ యూనియన్లు కలిసి కుట్ర పన్నాయన్న ఆరోపణలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కుట్ర చేసినట్టు ఆధారాలు ఉంటే జైలుకు పంపించాలని సవాల్ చేశారు. కోర్టులో తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్దంగానే పోరాడుతోందని చెప్పారు. 24 మంది కార్మికులు చనిపోయినా ఇప్పటికీ కేసీఆర్ ఇగో తగ్గలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.

కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న తలపెట్టిన సడక్ బంద్‌కి అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>