హుజూర్‌నగర్ ఓటమితో ఉత్తమ్ హీరో అయ్యాడు.. లేదంటే రేవంత్.. : జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెకు మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఉపఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని.. గతంలో టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా అధికార పార్టీలే లబ్ది పొందాయని గుర్తుచేశారు. కాబట్టి ఉపఎన్నికలు ఎప్పుడు ఏ పార్టీకి రెఫరెండం కాదని స్పష్టం చేశారు.

  • Share this:
    హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ పద్మావతి గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని.. ఆమె ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యారని అన్నారు. గతంలో సైన్యంలో పనిచేసిన ఉత్తమ్.. చాలా ధైర్యవంతుడని.. ఇప్పుడాయనకు ప్రత్యేకంగా ధైర్యం చెప్పాల్సిన పనిలేదన్నారు. యుద్ద విమానంలో దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి ఉత్తమ్ అని కొనియాడారు. హుజూర్‌నగర్‌లో ఓడిపోయినంత మాత్రాన ఉత్తమ్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని..ఆయన పదవి ఎక్కడికి పోదని అన్నారు.ఇకనుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు రూ.30కోట్లతో సిద్దంగా ఉండాలని అన్నారు.ఉపఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని.. గతంలో టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా అధికార పార్టీలే లబ్ది పొందాయని గుర్తుచేశారు. కాబట్టి ఉపఎన్నికలు ఎప్పుడు
    ఏ పార్టీకి రెఫరెండం కాదని స్పష్టం చేశారు.
    Published by:Srinivas Mittapalli
    First published: