Home /News /politics /

UTTARAKHAND MANIPUR GOA ASSEMBLY ELECTION RESULTS WHAT EXIT POLLS PREDICTED IN THESE STATES BA

Uttarakhand, Goa, Manipur Election Results: ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

మణిపూర్ పోలింగ్ (File)

మణిపూర్ పోలింగ్ (File)

Assembly Election 2022 Results in Telugu | మార్చి 7న పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని లెక్కిస్తే యూపీలో మరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రావొచ్చని లెక్కలు చెబుతున్నాయి. ఇక మిగిలిన మూడు చోట్ల ఎలాంటి ఫలితాలు రావొచ్చని అంచనా వేశాయో చూద్దాం.

ఇంకా చదవండి ...
    Election Results Live Today: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలిపోనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, మణిపూర్, కేంద్ర పాలిత ప్రాంతం గోవాల్లో ఫలితాలు 11 గంటల వరకే తేలిపోనున్నాయి. ఎక్కడ ఎవరు అధికారంలోకి రానున్నారు? ఏ పార్టీ పవర్ లోకి వస్తుంది? అనే అంశం తేలడానికి ఈ మూడు చోట్లా ఎక్కువ సమయం పట్టదు. కేవలం యూపీ, పంజాబ్‌లో మాత్రమే కొంచెం ఎక్కువ సమయం పట్టనుంది. యూపీలో 403 సీట్లు కావడంతో అక్కడ సాయంత్రం వరకు ఎన్నికలపై పూర్తి క్లారిటీ రాకపోవచ్చు. మార్చి 7న పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని లెక్కిస్తే యూపీలో మరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రావొచ్చని లెక్కలు చెబుతున్నాయి. ఇక మిగిలిన మూడు చోట్ల ఎలాంటి ఫలితాలు రావొచ్చని అంచనా వేశాయో చూద్దాం.

    ఉత్తరాఖండ్‌లో హంగ్ అసెంబ్లీ? Uttarakhand Election Result
    ఉత్తరా ఖండ్ లో 70 నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉత్తర ఖండ్ (Assembly Elections 2022) 59.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటి నెలకొంది. బీజేపీకి ఇప్పటికే ముగ్గురు సీఎంలను మార్చింది. దీంతో ఇక్కడ బీజేపీ మరోసారి అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఉత్తరాఖండ్‌లో కూడా హంగ్ అసెంబ్లీ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ లెక్కేశాయి.

    గోవాలోనూ హంగ్ అసెంబ్లీ? Goa Election Result
    గోవా లో (Goa) ఒకే దశలో ఎన్నికలను ఫిబ్రవరి 14 ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా..79.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవాలో (Goa assembly Elections 2022) బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటి నెలకొంది. ఇక్కడ హంగ్ అసెంబ్లీ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

    మణిపూర్‌‌లో బీజేపీ Manipur Election Result
    మణిపూర్ (Manipur) లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు విడతలో ఎన్నికలు నిర్వహించారు. తొలివిడతలో రికార్డు స్థాయిలో 78.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Central Elections Commission)వెల్లడించింది. కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మార్చి 5న జరిగిన రెండో విడత ఎన్నికలలో 76 శాతం ఓటింగ్ నమోదైంది. మణిపూర్‌లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Assembly Election 2022, Goa Assembly Elections 2022, Manipur Assembly elections 2022, Uttarakhand Assembly elections 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు