Uttarakhand CM Resign: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా.. కాబోయే సీఎం ఆయనేనా?

Uttarakhand CM Resign: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా.. కాబోయే సీఎం ఆయనేనా?

త్రివేంద్ర సింగ్ రావత్ (Image; ANI)

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌లో ఆయన మీద ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఢిల్లీ పెద్దలు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం డెహ్రోడూన్ వెళ్లిన త్రివేంద్ర సింగ్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

  • Share this:
    ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌లో ఆయన మీద ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఢిల్లీ పెద్దలు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం డెహ్రోడూన్ వెళ్లిన త్రివేంద్ర సింగ్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసిన అనంతరం రావత్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రానికి సేవ చేసే బంగారు అవకాశాన్ని పార్టీ నాకు కల్పించింది. అలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. ఇప్పుడు ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. నేను నా రాజీనామాను గవర్నర్‌కు ఇచ్చాను. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.’ అని త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.

    ఉత్తరాఖండ్‌లో రావత్ నాయకత్వం మీద రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కొందరు నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు కూడా సీఎం రావత్‌కు వ్యతిరేకంగా చక్రం తిప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఢిల్లీ పెద్దలు ఉత్తరాఖండ్‌కు ఒక టీమ్‌ను పంపారు. ఆ టీమ్ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించి రిపోర్టు ఇచ్చింది. అనంతరం ఢిల్లీ అధిష్టానం రావత్‌ను పిలిపించి మాట్లాడింది. నిన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన రావత్ ఈ రోజు గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.

    కాబోయే సీఎం ఎవరు?
    వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రావత్ రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త సీఎం ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పగ్గాలు చేపట్టబోయే సీఎం ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం పదవి కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అజయ్ భట్, మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ఉన్నత విద్యా శాఖ సహాయ మంత్రి ధన్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని, ఆర్‌ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ భట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా లిస్టు చాలా ఉంది. వారిలో పోక్రియాల్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు