అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులను శిక్షిస్తాం : సీఎం యోగి

Yogi Adityanath on Illicit Affiars : వివాహేతర సంబంధాలపై యోగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ప్రవేశపెట్టిన ఓ పథకం గురించి ఏర్పాటు చేసిన సభలో యోగి వివాహేతర సంబంధాలపై మాట్లాడారు.

news18-telugu
Updated: September 26, 2019, 9:39 AM IST
అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులను శిక్షిస్తాం : సీఎం యోగి
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
వివాహేతర సంబంధాలు పెట్టుకునే పురుషులను కఠినంగా శిక్షిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.త్వరలోనే ఇందుకోసం కఠిన చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి యోగి వ్యాఖ్యలతో విబేధించారు. ఇలాంటి చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి కుదరదని,కేంద్రమే చట్టం చేయాల్సి ఉంటుందని అన్నారు. అయినా భార్య ఫిర్యాదు లేకుండా పురుషుడిపై వివాహేతర సంబంధం కింద కేసు నమోదు చేయడానికి చట్టం ఒప్పుకోదన్నారు. వివాహేతర సంబంధాలపై యోగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ప్రవేశపెట్టిన ఓ పథకం గురించి ఏర్పాటు చేసిన సభలో యోగి వివాహేతర సంబంధాలపై మాట్లాడారు.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 216 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కింద ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలకు రూ.6వేలు అందిస్తామని చెప్పారు. ఇది గాక..ఇల్లు లేని మహిళలకు ఇల్లు, వారి పిల్లలకు విద్య, స్కాలర్‌షిప్,ఆయుష్మాన్ యోజన కింద హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త దీన్ దయాల్ ఆశయాల మేరకు.. ప్రజలకు చేరువయ్యేందుకు చట్టాల రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్లు వచ్చాయన్నారు.అలాగే టాయిలెట్స్,ఎలక్ట్రిసిటీ,నాణ్యమైన ఆహారం,ఆరోగ్య సేవలు అందుతున్నాయని చెప్పారు.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు