UTTAR PRADESH ELECTIONS CONGRESS TICKET FOR ORDINARY DALIT GIRL PVN
UP Polls : సాధారణ దళిత యువతికి కాంగ్రెస్ టిక్కెట్
నిర్మలా భారతితో ప్రియాంక గాంధీ(ఫైల్ ఫొటో)
UP Congress : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో అభ్యర్థుల జాబితాలో ఓ సాధారణ దళిత యువతి పేరు కూడా ఉంది. చిత్రకూట్(Chitrakut)జిల్లాలోని కార్వీ సదర్ విధానసభ నుంచి మాజీ జిల్లా పంచాయతీ సభ్యురాలు నిర్మలా భారతి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ.
Uttar Pradesh Elections : దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేస్తున్నాయి. లడ్కీ హూన్ లడ్కో శక్తి హూన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలపై ఆశలు పెట్టుకుని పోటీ చేస్తుంది. మహిళలకు 40 శాతం సీట్లు కేటాయించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 255 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా..తాజాగా 89 మంది అభ్యర్థులతో మూడో లిస్ట్ ను విడుదల చేసింది. లఅయితే కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల కోసం తాజాగా విడుదల చేసిన మూడో అభ్యర్థుల జాబితాలో 37 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. 125 మందితో విడుదల చేసిన మొదటి అభ్యర్థుల లిస్ట్ లో 50మంది మహిళలకు,41స్థానాలకు విడుదల చేసిన రెండో అభ్యర్థుల లిస్ట్ లో 16మంది మహిళలకు కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ రంగంలోకి దిగిన కొందరు మహిళల్లో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసనలతో సంబంధం ఉన్నవారు కూడా ఉన్నారు.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో అభ్యర్థుల జాబితాలో ఓ సాధారణ దళిత యువతి పేరు కూడా ఉంది. చిత్రకూట్(Chitrakut)జిల్లాలోని కార్వీ సదర్ విధానసభ నుంచి మాజీ జిల్లా పంచాయతీ సభ్యురాలు నిర్మలా భారతి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ-ఎస్పీ అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్న ఈ సీటులో ఈ సాదాసీదా దళిత యువతి కాంగ్రెస్ టిక్కెట్ పై ఎలా సత్తా చాటుతుందో చూడాలి.
గతేడాది నవంబర్ లో చిత్రకూట్‌లోని రామ్‌ఘాట్‌లో ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పాల్గొన్నప్పుడు..ప్రియాంక గాంధీ సమక్షంలో దళిత యువతి నిర్మలా భారతికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె తన బాధను వ్యక్తం చేసింది. కార్యక్రమంలో ఈ దళిత కుమార్తె తాము ఎదుర్కొంటున్న బాధలను సభా ముఖంగా వివరించింది. ఆమె మాట్లాడే శైలిని అందరినీ ఆకట్టుకుంది. తన ప్రసంగంతో ప్రియాంక గాంధీని కూడా ఆకట్టుకుంది. బహిరంగంగా ప్రియాంక గాంధీ ముందు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని మాట్లాడింది. ఆమె మాట్లాడే తీరుతో మంత్రముగ్ధులైన ప్రియాంక చివరకు నిర్మలని ఆలింగనం చేసుకుని సెల్ఫీ కూడా దిగింది.
ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.