UTTAR PRADESH ELECTIONS 36 33 PERCENT VOTERS TURNOUT RECORDED TILL 1 PM DURING ONGOING POLLING ACROSS 10 DISTRICTS IN THE SIXTH PHASE SK
UP Assembly Elections 2022: యూపీలో ఆరో దశ ఎన్నికలు.. పోలింగ్ శాతం వివరాలు
యూపీలో ఆరో విడత పోలింగ్
UP Assembly Elections 2022: యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశలు ముగిశాయి. నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 675 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోరఖ్పూర్(Gorakhpur)లోని ఓ పోలింగ్ కేంద్రంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేశారు. కానీ ఇప్పుడే తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక పతార్దేవా నుంచి సూర్యప్రతాప్ సాహి, ఎత్వా నుంచి సతీష్ చంద్ర ద్వివేది, బన్సి నుంచి జైప్రతాప్ సింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఆరో దశ ఎన్నికల్లో 80శాతం సీట్లు తమకే వస్తాయని స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్నారు సీఎం యోగి.
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా పడిపోయిది.. అయినప్పటికీ ఎన్నికల సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ఉన్న వారినే పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రం ముందు పోలీస్ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలుచేపట్టారు.
మొత్తం ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశలు ముగిశాయి. నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ (BJP), సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) మధ్యే ప్రధానంగా పోటీ ఉందని అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. వీరితో పోల్చితే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి యూపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. అంతా తానై నడిపిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.