Home /News /politics /

UTTAR PRADESH ASSEMBLY POLLS 2020 CM YOGI ADITYANATH LIKELY TO CONTEST FROM AYODHYA SEAT MKS

UP Election 2022: రామజన్మభూమి అయోధ్య నుంచి cm Yogi పోటీ.. బీజేపీ అనూహ్య స్ట్రాటజీ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

‘హిందువులను ఏకం చేసే ఏకైక అంశం.. అయోధ్యలో రామ రామమందిరం. దీన్ని మించి హిందూ ఐక్యతకు మరో అంశం లేదు. అలాంటి పవిత్రమైన చోటు నుంచి సీఎం యోగి పోటీ చేయడాన్ని.. అది కూడా భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుతోన్న సమయంలో బరిలోకి దిగడాన్ని అరుదైన గొప్ప సందర్భంగా భావిస్తామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...
‘భగవాన్ శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో ఆలయం నిర్మించాం.. పరమేశ్వరుడు కొలువైన కాశీలో విశ్వనాథ్ ధామ్ నిర్మించాం.. అలాంటిది శ్రీకృష్ణుడి జన్మస్థలం మథురను విస్మరించగలమా? కచ్చితంగా అక్కడ ఆలయాన్ని కట్టి తీరుతాం.. ’ అంటూ యూపీ బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా కాలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా యోగిని మథుర నుంచే పోటీకి దింపాలంటూ ఎంపీలు, కీలక నేతలు బీజేపీ హైకమాండ్ కు లేఖలు కూడా రాశారు. అందుకు ఢిల్లీ పెద్దలు సరేనన్నారని, మథురలో యోగి పోటీకి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్ గా సీన్ మారింది. సీఎం యోగి మథుర నుంచి కాదు అయోధ్య నుంచే అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నట్లు సంకేతాలు వెలవడ్డాయి..

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల మూడో వారం నుంచి ఆయా స్థానాలకు నోటిఫికేషన్లు కూడా జారీ కానున్నాయి. ఈ క్రమంలో టికెట్ల పంపకంపై బీజేపీ దృష్టిసారించింది. యూపీ ఎన్నికల కమిటీ, పార్టీ కోర్ గ్రూప్ బుధవారం నాడు ఢిల్లీలో భేటీ అయింది. టికెట్ల కేటాయింపులపై జరిగిన చర్చలో సీఎం యోగిని అయోధ్య నుంచి పోటీకి దింపాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

UP Election 2022: బీజేపీకి భారీ షాక్ -మంత్రి పదవికి మౌర్య రాజీనామా.. ఆ వెంటనే..




‘హిందువులను ఏకం చేసే ఏకైక అంశం.. అయోధ్యలో రామ రామమందిరం. దీన్ని మించి హిందూ ఐక్యతకు మరో అంశం లేదు. అలాంటి పవిత్రమైన చోటు నుంచి సీఎం యోగి పోటీ చేయడాన్ని.. అది కూడా భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుతోన్న సమయంలో బరిలోకి దిగడాన్ని అరుదైన గొప్ప సందర్భంగా భావిస్తామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

UP Election 2022: మాయావతి ఎక్కడ? పోటీకి దూరంగా BSP అధినేత్రి



గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య సీటును బీజేపీనే గెలుచుకుంది. సీఎం యోగి సిద్ధమేనని చిన్న హింట్ ఇచ్చినా ఆనందంగా అయోధ్య స్థానం నుంచి తప్పుకుంటానని సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తా ఇప్పటికే పలు మార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. అయోధ్య అసెంబ్లీ స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుంది. ఐదో దశలో భాగంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ జరుగనుండగా, మార్చి 10న ఫలితాలు వస్తాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Ayodhya, Bjp, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు