హోమ్ /వార్తలు /National రాజకీయం /

CM Yogi: యోగి ప్రభంజనం.. గోరఖ్‌పూర్‌లో 1లక్షకుపైగా మెజార్టీతో విజయం.. Lakhimpurలో బీజేపీ క్లీన్ స్వీప్

CM Yogi: యోగి ప్రభంజనం.. గోరఖ్‌పూర్‌లో 1లక్షకుపైగా మెజార్టీతో విజయం.. Lakhimpurలో బీజేపీ క్లీన్ స్వీప్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ‘యూపీ మే యోగి బా’ అంటూ శ్రేణులు సంబురాలను హోరెత్తించారు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ తన మాతృస్థానం గోర్ ఖపూర్ లో ఒక లక్షకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అంతటా మారుమోగుతోన్న నినాదం.. ‘UP mein Yogi ba (యూపీ మే యోగీ బా)..’. ఎన్నికల ప్రచారంలో గాయని రాథోడ్ రూపొందించిన ‘యూపీ మే కాబా (యూపీలో ఏం జరుగుతోందబ్బా?)’ పాట సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ పాటలోని పదాలకు కొనసాగింపుగా ‘యూపీ మే సపాబ (యూపీలో సమాజ్ వాదీ పార్టీనేనబ్బా)’, ‘యూపీ మే భాజపా బా (యూపీ భాజపాదే)’అనే పేరడీలూ వచ్చాయి. గురువారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ‘యూపీ మే యోగి బా’ అంటూ శ్రేణులు సంబురాలను హోరెత్తించారు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ తన మాతృస్థానం గోర్ ఖపూర్ లో ఒక లక్షకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.

ఈసారి కూడా ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 265 సీట్లలో లీడ్ సాధించగా, వాటిలో 179చోట్ల ఫలితాల ప్రకటన పూర్తయింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజవ్ వాదీ పార్టీ కేవలం 132 సీట్లలో ఆధిక్యాన్ని సాదించగా, 48 స్థానాల్లో విజయం ఖరారైంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయి 2 సీట్లలో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది.

గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగి ఆదిత్యనాథ్ తన సమీప ప్రత్యర్థిపై 1,01,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985 నుంచి ఇప్పటివరకు యూపీలో ఏ సీఎం కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ములాయం సింగ్, కల్యాణ్​ సింగ్, మాయావతి, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్ నాథ్ సింగ్, అఖిలేశ్ యాదవ్ సీఎంలుగా పనిచేసినప్పటికీ తర్వాతి ఎన్నికల్లో వారి పార్టీలు గెలవలేదు. 37 ఏళ్ల తర్వాత యోగి ఒక్కరే రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రికార్డును సొంతం చేసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కర్హల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. అఖిలేశ్ 61,000 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. ఇక,

వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలో హింస చెలరేగిన లఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్‌లో హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కుమారుడు కారుతో ఢీకొట్టిన ఘటనలో పలువురు రైతులు మరణించారు. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.కానీ అవేమీ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. జిల్లాలోని మొత్తం 8 సీట్లలో బీజేపీయే గెలిచింది.

First published:

Tags: Akhilesh Yadav, Assembly Election 2022, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

ఉత్తమ కథలు