Home /News /politics /

UTTAR PRADESH ASSEMBLY ELECTION RESULTS 2022 BJP NEXT TARGET CM KCR UP BULLDOZERS COME TO TELANGANA SAYS MLA RAJA SINGH MKS

BJP తర్వాతి టార్గెట్ KCR: యూపీ బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయి.. ముందస్తు ప్లాన్ చెప్పేసిన నేత

రాజాసింగ్, కేసీఆర్

రాజాసింగ్, కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ.. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పావులు బీజేపీకి లాభం చేకూర్చుతోందనే వాదన వినిపిస్తోంది. బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయని రాజాసింగ్ అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారీ ప్రభంజన విజయనాన్ని నమోదుచేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో గెలుపునకు మ్యాజిక్ ఫిగర్ 202కాగా, బీజేపీ ఇప్పటికే 261 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వాటిలో 16 చోట్ల విజయాలు ఖరారయ్యాయి. గట్టి పోటీ ఇస్తుందనుకున్న సమాజ్ వాదీ పార్టీ 135 సీట్లలో మాత్రమే లీడింగ్ సాధించింది. మాయావతి నాయకత్వంలోని బీజేపీ కేవలం 2 సీట్లలో, ప్రియాంక గాంధీ అన్నీ తానై వ్యవహరించిన కాంగ్రెస్ కేవలం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా 2017 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలోనూ బీజేపీనే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సీట్లు సాధించింది. కాగా, కమలం తర్వాతి టార్గెట్ తెలంగాణే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ తదుపరి టార్గెట్ కేసీఆర్ ను గద్దెదించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం అనూహ్యంగా ఇక్కడ బీజేపీకి లాభం చేకూర్చుతోందనే వాదన వినిపిస్తోంది. సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ బీజేపీ దూకుడు పెంచనుందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..

సైలెంట్ కిల్లర్ Kejriwal: ఏ ప్రాంతీయ పార్టీకీ సాధ్యంకానిది.. KCR హడావుడి, Mamata గర్జనకు భిన్నంగా..


యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురై, కేసులను సైతం ఎదుర్కొంటున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. యూపీ ఫలితాల తర్వాత మరోసారి తన నోటికి పనిచెప్పారు. బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని.. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజసింగ్ అన్నారు.

Punjab Results 2022: తాగుబోతని తిట్టిపోశారు.. ఇప్పుడాయనే సీఎం అయ్యారు!.. Bhagwant Mann


తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీతో బీజేపీకి దోస్తీ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని, మజ్లిస్ బీజేపీకి ఎప్పుడైనా రాజకీయ శత్రువేననన్న రాజాసింగ్.. కేవలం డబ్బులు సంపాదన కోసమే దేశ వ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తోందని ఆరోపించారు. ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, CM KCR, Raja Singh, Telangana, Uttar Pradesh Assembly Elections

తదుపరి వార్తలు