హుజూర్ నగర్లో ఈవీఎంల ట్యాంపరింగ్.. ఈసీకి పద్మావతి ఫిర్యాదు
ప్రచారంలో ప్రజలు తమ వైపే ఉన్నారన్న పద్మావతి.. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ రిపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
news18-telugu
Updated: October 24, 2019, 8:29 PM IST

పద్మావతిరెడ్డి
- News18 Telugu
- Last Updated: October 24, 2019, 8:29 PM IST
హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మావతి ఆరోపించారు. హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల పరిశీలకుడిని కలిసి ఫిర్యాదు చేసిన ఆమె.. హుజూర్ నగర్ ఫలితాల్లో ఈవీఎంల ఫలితాలపై అనుమానాలున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. మెషిన్ ద్వారా వచ్చిన ఫలితం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో ప్రజలు తమ వైపే ఉన్నారన్న పద్మావతి.. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ రిపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం బతకాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు పద్మావతి.
కాగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం హజూర్ నగర్లో పద్మావతి ఓటమి పాలయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గలో తన భార్యను గెలిపించుకోలేకపోయారు. పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి 43,358 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. సైదిరెడ్డికి 113097 ఓట్లు పోలవగా..ఉత్తమ్ పద్మావతికి 69737 ఓట్లు మాత్రమే పడాయి. ఇక బీజేపీ అభ్యర్థి కోట రామారావు 2639, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి 1827 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐతే బీజేపీ, టీడీపీ అభ్యర్థుల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థి సంపత్ (2697)కు ఎక్కువ ఓట్లు పడడం విశేషం.

Loading...