టి కాంగ్రెస్ నేతలపై ఉత్తమ్ అసహనం... తొలిసారిగా...

తొలిసారిగా కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 26, 2019, 5:25 PM IST
టి కాంగ్రెస్ నేతలపై ఉత్తమ్ అసహనం... తొలిసారిగా...
ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)
  • Share this:
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారి పార్టీకి చెందిన ఇతర నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేయడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించేందుకు గాంధీభవన్‌లో సమావేశమైన టి కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు... ఎన్‌పీఆర్, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించబోయే ర్యాలీపై చర్చించారు. ఎంఐఎం తలపెట్టిన సభకు కాంగ్రెస్‌కు ఆహ్వానం వచ్చిందని... అయితే ఆ సభకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్‌లోని ఏ ఒక్క కూడా స్పందించకపోవడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రిజర్వేషన్లు ఖరారు కాకుండా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంపై తాను కోర్టుకు వెళతానంటే... టీఆర్ఎస్ తనపై రాజకీయంగా ఎదురుదాడి చేసిందని ఉత్తమ్ అన్నారు. అయితే ఆ విమర్శలకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా కౌంటర్ ఇవ్వకపోవడం తనను బాధించిందని ఆయన కమిటీ సమావేశంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకంగా రియాక్ట్ కావడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.

అయితే దీనిపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ నేతలంతా టీ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రియాక్టయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... టీపీసీసీపై ఎవరూ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని... దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టినప్పుడు అందరినీ సంప్రదిస్తుందని వివరించారు.

ఇది కూడా చూడండి :
Published by: Kishore Akkaladevi
First published: December 26, 2019, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading