హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..

Huzur Nagar By Poll | హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీ చేయనున్నారు.

news18-telugu
Updated: September 14, 2019, 8:58 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..
భార్య పద్మావతితో టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • Share this:
హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అయితే, కోదాడలో పద్మావతి ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఎంపీగా విజయం సాధించడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. హుజూర్ నగర్ అసెంబ్లీకి మరికొన్నాళ్లలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు ముందస్తుగానే అభ్యర్థిని ఖరారు చేసేశారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్ కలసి పోటీ చేశాయి. అయితే, ఆ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. టీఆర్ఎస్ 88 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది సభ్యులు గెలిచారు. అయితే, ఆ తర్వాత టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు కారెక్కారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం మొత్తం టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరిని బరిలోకి దింపే కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యను బరిలోకి దింపాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. బయట నుంచి నేతను తీసుకొచ్చి బరిలోకి దింపితే.. స్థానికంగా వ్యతిరేక ప్రభావం వచ్చే అవకాశం ఉంది. దీంతో ఉత్తమ్ భార్య పద్మావతిని పోటీకి నిలుపుతోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 14, 2019, 8:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading