ఉత్తమ్ సంచలన ప్రకటన... ఆ పదవికి గుడ్ బై...

టీ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కీలక ప్రకటన చేశారు.

news18-telugu
Updated: December 31, 2019, 9:01 PM IST
ఉత్తమ్ సంచలన ప్రకటన... ఆ పదవికి గుడ్ బై...
ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు హుజూర్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తరువాత టీ పీసీసీ చీఫ్ పదవి వదులుకుని హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నట్టు ఆయన తెలిపారు. తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఆయనను అధిష్టానం పెద్దలే నచ్చజెబుతూ వస్తున్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఇప్పటికప్పుడు టీ పీసీసీ చీఫ్ పదవిని తీసుకునేందుకు కాంగ్రెస్ నేతలెవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే మున్సిపల్ ఎన్నికల తరువాత కచ్చితంగా టీ పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం వల్లే... ఉత్తమ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

First published: December 31, 2019, 8:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading