దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్...

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

news18-telugu
Updated: August 14, 2020, 3:32 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్...
ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • Share this:
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బలహీనమైందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని నేతలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పీసీసీ తరఫున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మండల స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆ సమావేశాలకు పార్టీ ముఖ్యనేతలను అందర్నీ పిలిచి సమన్వయం చేసుకోవాలన్నారు.

2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతామని చెప్పడంతో పోలింగ్ అనివార్యం అయింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 14, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading