ఉత్తమ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలవరం... కాంగ్రెస్ ఇదే ?

ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అధికార పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్‌పై విమర్శలు చేసే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

news18-telugu
Updated: January 1, 2020, 12:55 PM IST
ఉత్తమ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలవరం... కాంగ్రెస్ ఇదే ?
తెలంగాణ కాంగ్రెస్
  • Share this:
మరికొద్ది రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కలవరం మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం ప్రస్తుత టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న హుజూర్ నగర్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. త్వరలోనే తాను టీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానని... ఆ తరువాత నియోజకవర్గం కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తానని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత టీ పీసీసీ చీఫ్ పదవికి తాను గుడ్ బై చెప్పబోతున్నట్టు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

అయితే ఉత్తమ్ ఎన్నికలకు ముందు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ శ్రేణులకు ఇబ్బందిగా మారింది. ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్నీమధ్య ఉత్తమ్ మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకు వెళతానని చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయమని... అందుకే ఆ పార్టీ నేతలు కోర్టుకు వెళతామని అంటున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

TPCC Chief Change,TPCC Chief Race,Revanth Reddy,Komati Reddy Vankatreddy,Sridhar babu,Jeevan Reddy,Congress News,T Congress chief,తెలంగాణ కాంగ్రెస్ వార్తలు,టీపీసీసీ చీఫ్,ఉత్తమ్ కుమార్ రెడ్డి,రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంటకరెడ్డి,జీవన్ రెడ్డి,శ్రీధర్ బాబు
ఉత్తమ్ కుమార్, రాహుల్ గాంధీ


తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అధికార పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్‌పై విమర్శలు చేసే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా నేతలు ఎన్నికలపై కంటే ఎక్కువగా టీ పీసీసీ పదవి దక్కించుకోవడంపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే... కాంగ్రెస్‌లో ఎన్నికలను పట్టించుకోవడానికి బదులుగా టీ పీసీసీ పంచాయతీ మొదలుకావడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: January 1, 2020, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading