రైతు సమస్యలపై ప్రశ్నిస్తే బూతులు తిట్టిన సీఎం కేసీఆర్: ఉత్తమ్

ఉత్తమ్ కుమార్ రెడ్డి

కందుల రైతుల విషయంలో తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, దానికి సమాధానం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ బూతు మాటలతో తిట్టారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

  • Share this:
    కందుల రైతుల విషయంలో తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, దానికి సమాధానం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ బూతు మాటలతో తిట్టారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా లోని పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. వరి ధాన్యం ప్రభుత్వమే కొంటామని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా 25 శాతం మాత్రమే కొన్నారని, ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యం అన్నారు. 42 కిలోల ధాన్యాన్ని 40 కిలోలకే కొనుగోలు చేయాలనీ 2 కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. మిల్లులోకి వెళ్ళాక మరో రెండు కిలోలు తీసి మొత్తం నాలుగు కిలోల తరుగు తీసి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ప్రోక్యుమెంట్ ఇంతటి సమస్య లేదని, కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోనే రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఉన్న ఓ అధికారపార్టీ నాయకుడు మిల్లర్ల తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఇక బత్తాయి తింటే రోగ నిరోధకశక్తి పెరుగుతుందని చెప్పిన సీఎం, అసలు వ్యాపారమే జరగకుండా బత్తాయి సరుకు మొత్తం రాష్ట్రంలోనే ఆపారని, ఇప్పుడు బత్తాయి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, దానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల పంట కొనుగోలు విషయం లో సీఎం కేసీయార్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కంటే మెరుగ్గానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: