TPCC: బీజేపీ-టీఆర్ఎస్ ములాఖత్.. ఉత్తమ్ సంచలన ఆరోపణలు

TPCC: టీఆర్ఎస్-బీజేపీ ములాఖత్ అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ధ్వజమెత్తారు. నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ సంస్థల కోసమేనని ఆరోపించారు.

news18-telugu
Updated: September 28, 2020, 3:03 PM IST
TPCC: బీజేపీ-టీఆర్ఎస్ ములాఖత్.. ఉత్తమ్ సంచలన ఆరోపణలు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైల్ ఫోటో..
  • Share this:
పార్లమెంట్ లో అప్రజాస్వామికంగా మూడు వ్యవసాయ బిల్లులను పాస్ చేయించి బీజేపీ రైతులకు అన్యాయం చేసిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వ్యవసాయ బిల్లు పై రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కారణం చూపి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. అయితే సీఎం తో భేటీకి కరోనా అడ్డు రావడం లేదా అని ప్రశ్నించారు. గవర్నర్ ఒప్పుకోకపోయినా రాజ్ భవన్ గేటుకు వినతి పత్రం ఇస్తామన్నారు. పార్లమెంట్ లో ఏకపక్షంగా మూడు బిల్లులను అప్రజాస్వామికంగా బిజెపి పాస్ చేయించిందన్నారు. వ్యవసాయ బిల్లుల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కురుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుబంధ పార్టీలు వ్యతిరేకించినా బీజేపీ పార్లమెంట్ లో బిల్లులను పాస్ చేయించిందన్నారు. రాజ్యసభ లో బీజేపీ కి బలం లేకున్నా అప్రజాస్వామికంగా బిల్లులు ఆమోదించారని ధ్వజమెత్తారు.

బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్- కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారిందని విమర్శించారు. బిల్లులో రైతులకు న్యాయం, లాభం చేసేలా ఎలాంటి హామీ లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరేలా కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులు ఉన్నాయన్నారు. వ్యవసాయ బిల్లుల వెనుక అనేక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని పార్లమెంట్ బయట మాట్లాడిన మాటలు బిల్లులో లేవన్నారు. రైతులకు స్పష్టమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉండాలన్నారు. మూడు బిల్లుల్లో రైతులకు ధర భరోసా లేదన్నారు. ఈ బిల్లుల వల్ల రైతులకు కొత్తగా వచ్చే లాభం ఏమీలేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రమే కొత్తగా లాభం చేకూరుతుందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు కావాల్సినంత ఆహార ఉత్పత్తులు చేసుకోవడానికి, ధరలు పెంచడానికి అవకాశం కల్పించారన్నారు. దేశం అంతా ఒక ధర ఉంటే బీహార్ లో 25శాతం తక్కువ ధర ఉంటుందన్నారు. ఇప్పుడు బీహార్ రైతుల పరిస్థితి దేశం అంతా వర్తించేలా కొత్త చట్టాలు బీజేపీ తెచ్చిందన్నారు.

రైతులకు కేసీఆర్ అన్యాయం..
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ తెచ్చే ప్రతీ ఆర్డినెన్స్, చట్టం, రూల్ కు అనుకూలంగా టీఆర్ఎస్ అనుకూలంగా ఓట్లు వేసిందన్నారు. ప్రతీ విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. రైతు బిల్లులకు టీఆర్ఎస్ అడ్డుచెప్పడంలో చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. దేశ చరిత్రలో రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అసమర్థత వల్ల తెలంగాణ రైతులకు పంట భీమా లేకుండా పోయిందన్నారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో సరైన సమయంలో పాస్ పుస్తకాలు ఇవ్వనందునే 10 లక్షల మందికి రైతుబంధు అందడం లేదన్నారు. అక్టోబర్ 2న రైతు సమస్యల పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
నిర్వహించనున్నట్లు చెప్పారు.
Published by: Nikhil Kumar S
First published: September 28, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading