TPCC: ఆ చట్టంతో రైతులకు నష్టమన్న ఉత్తమ్.. ఆందోళనలకు పిలుపు

TPCC: ప్రజలంతా రైతుల తరఫున గళం విప్పాల్సిన అవసరం ఉందని ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: September 26, 2020, 5:44 PM IST
TPCC: ఆ చట్టంతో రైతులకు నష్టమన్న ఉత్తమ్.. ఆందోళనలకు పిలుపు
ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రజలంతా రైతుల తరఫున గళం విప్పాల్సిన అవసరం ఉందని ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరంతరం రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ మధ్య కాలంలో లోక్ సభ, రాజ్య సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కి రైతు వ్యతిరేక చట్టాలను రూపొందించారని ధ్వజమెత్తారు.

ఇది అత్యంత నీచమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుందన్నారు. అందరం రైతుల పక్షాన నిలబడుదామని పిలుపునిచ్చారు. బడా కంపెనీలకు లాభం చేస్తూ, రైతులకు నష్టం చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ చట్టాల్లో ఎక్కడ కూడా కనీస మద్దతు ధర ప్రస్తావన లేదన్నారు. మద్దతు ధరను కొనసాగిస్తామని చట్టంలో పొందుపర్చలేదన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులంతా రైతుల పక్షాన నిలబడి పోరాడాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేశారు.




కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుపై అనేక పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఆందోళనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు రైతులకు హాని చేసేలా ఉందంటూ ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళనలు నిర్వహించారు.
Published by: Nikhil Kumar S
First published: September 26, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading