ట్రంప్‌పై భారత్ గుస్సా.. కాశ్మీర్‌ కోసం మధ్యవర్తిగా ఉండాలని కోరామా అంటూ..

Kashmir Issue: కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని మోదీ ఎప్పుడు కూడా ట్రంప్‌‌ను కోరలేదని భారత్ స్పష్టం చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 23, 2019, 8:46 AM IST
ట్రంప్‌పై భారత్ గుస్సా.. కాశ్మీర్‌ కోసం మధ్యవర్తిగా ఉండాలని కోరామా అంటూ..
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్(File)
  • Share this:
కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను అడిగారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో అన్నారు. దీనికి సంబంధించిన వార్తలు అన్ని వార్త ఛానళ్లలో బ్రేకింగ్ అయ్యాయి. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మోదీ కోరారా? అంటూ ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వార్త సంస్థ కథనం ప్రకారం.. ‘కాశ్మీర్ అంశంపై ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాలని ప్రధాని మోదీ నన్ను కోరారు. పాక్ పిలిస్తే కూడా తప్పకుండా వస్తా’ అని అన్నారు. అయితే ఇమ్రాన్, ట్రంప్ సమావేశం గురించి వైట్‌హౌస్ తన ప్రకటనలో పేర్కొన్నా, కాశ్మీర్ ప్రస్తావన మాత్రం అందులో లేదు.

కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. ట్రంప్ చేసిన ఆరోపణలు అబద్ధమని, వాటిని ఖండిస్తున్నామని వ్యాఖ్యానించింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని మోదీ ఎప్పుడు కూడా ట్రంప్‌‌ను కోరలేదని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకుంటామని, ఇందుకోసం సరిహద్దు ఉగ్రవాద, సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ఉన్నాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.





First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...