Us Elections 2020: ఆయన చెబితే అస్సలు వేసుకోను.. ట్రంప్ పై నిప్పులు చెరిగిన కమలా హారిస్

vice presidential debate: అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కోవిడ్ పై ట్రంప్ వైఖరిని ఎండగడుతూ డెమొక్రట్లు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇదే క్రమంలో ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హారిస్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18
Updated: October 8, 2020, 11:20 AM IST
Us Elections 2020: ఆయన చెబితే అస్సలు వేసుకోను.. ట్రంప్ పై నిప్పులు చెరిగిన కమలా హారిస్
కమలా హారిస్(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: October 8, 2020, 11:20 AM IST
  • Share this:
అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..  ఉపాధ్యక్ష డిబేట్ బుధవారం రాత్రి జరిగింది. అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో జరిగిన ఈ చర్చలో.. డెమొక్రాట్ల తరఫున పోటీ పడుతున్న కమలా హారిస్, రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న మైక్ పెన్స్ పాల్గొన్నారు. చర్చలో సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ... కరోనా వ్యాప్తని నివారించడంలో ట్రంప్ పరిపాలనా విభాగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అమెరికన్లు ఎవరూ ఆయనను నమ్మడం లేదనీ, ఒకవేళ ట్రంప్.. కరోనా వ్యాక్సిన్ ను వేసుకోమని చెబితే తాను వేసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ‘అత్యంత తీవ్రమైన వైఫల్యం’అని ఆరోపించారు.

అమెరికా దేశ చరిత్రలో ఇంతటి అసమర్థ నాయకుడిని చూడలేదని నిప్పులు చెరిగారు. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటిందనీ, అధ్యక్షుడు ఆయన భార్యతో సహా 75 లక్షలకు మందికి పైగా పాజిటివ్ గా తేలారని, ఇది ట్రంప్ పరిపాలనా వైఫల్యం కాదా..? అని ఆమె ప్రశ్నించారు.

నవంబర్ నాటికి కరోనాకు టీకా తీసుకొస్తామని, ప్రజలందరికీ అందజేస్తామని ట్రంప్ ప్రగల్బాలు పలుకుతున్నారనీ, కానీ దానిని నమ్మడానికి లేదని చెప్పారు. ట్రంప్ తీసుకుంటున్న చర్యల ఫలితంగా అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. కరోనా గురించి ముందస్తు సమాచారం ఉన్నా.. దానిపై ట్రంప్ నిర్లక్ష్యం వహించాడని, ఆ ఫలితంగా దేశం మునుపెన్నడూ చూడని సంక్షోభంలోకి చిక్కుకుపోయిందని మండిపడ్డారు. ఆదాయపు పన్నును కూడా చెల్లించలేదనీ, పన్నులు చెల్లించకపోవడానికి కారణాలేవో వివరించాలని ప్రశ్నించారు.

ఇక చర్చలో సందర్భంగా మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ఈ ఏడాది యూఎస్ పెను సవాళ్లను ఎదుర్కొంటున్నదని, అయినా అమెరికన్ల ఆరోగ్య విషయంలో మాత్రం తాము వెనకడుగు వేయలేదని తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి చైనాయే కారణమని ఆరోపించారు. ట్రంప్ యంత్రాంగం చేపట్టని చర్యల వల్లే లక్షలాది మంది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పిందని స్పష్టం చేశారు. చైనా పై ఆంక్షలు విధించినప్పుడు బైడెన్ తప్పుబట్టారని, ఆయన చైనాకు వంత పాడుతున్నారని ఆరోపించారు.

ఇదిలాఉండగా.. ఈనెల 15న జరగబోయే అధ్యక్షుల రెండో డిబేట్ పై ఇంకా అనుమానాలు నెలకొనే ఉన్నాయి. మియామిలో జరగాల్సి ఉన్న ఈ చర్చా కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంది. కోవిడ్ సోకినా నాలుగురోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్.. ఏకంగా వైట్ హౌస్ లోనే మాస్కు లేకుండా తిరుగుతున్నారు. మరోవైపు.. ట్రంప్ కు ఇంకా కోవిడ్ ఉన్నట్టైతే తాను ఆయనతో చర్చ చేయనని ఆయన ప్రత్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Published by: Srinivas Munigala
First published: October 8, 2020, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading