• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • US RULED INDIA FOR 200 YEARS SAYS UTTARAKHAND CHIEF MINISTER TIRATH SINGH RAWAT OPPOSITION SLAMS NEW CM SK

భారత్‌ను అమెరికా పరిపాలించిందా..? ఎపూ..డు...? ఉత్తరాఖండ్ కొత్త సీఎంపై సెటైర్లు

భారత్‌ను అమెరికా పరిపాలించిందా..? ఎపూ..డు...? ఉత్తరాఖండ్ కొత్త సీఎంపై సెటైర్లు

తీరథ్ సింగ్ రావత్

మన దేశాన్ని అమెరికా పాలించిందా.. ఎపూ..డు అని విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. భారత్‌ను బ్రిటిష్ వారు పాలించారని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని.. ఈ మాత్రం చరిత్ర తెలియని వారు కూడా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Share this:
    ఉత్తరాఖండ్‌ కొత్త సీఎం తీరథ్ సింగ్ రావత్.. మొన్నే పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పుడే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మహిళలు చిరిగిన జీన్స్ వేసుకొని సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అంతలోనే మరోసారి విపక్షాలకు దొరికిపోయారు తీరథ్ సింగ్ రావత్. మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా కరోనాను ఎదుర్కోలేక చేతులెత్తేసిందన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అవునా.. మన దేశాన్ని అమెరికా పాలించిందా.. ఎపూ..డు అని సెటైర్లు వేస్తున్నారు. భారత్‌ను బ్రిటిష్ వారు పాలించారని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని.. ఈ మాత్రం చరిత్ర తెలియని వారు కూడా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.


    ఆదివారంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తీరథ్ సింగ్ రావత్ కరోనా పరిస్థితులపై మాట్లాడారు. ''మన దేశంలో నరేంద్ర మోదీ స్థానంలో వేరొకరు ప్రధానిగా ఉంటే కరోనా సమయంలో ఏం జరిగి ఉండేదో ఎవరూ ఊహించలేదురు. అప్పుడు చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ తన చర్యలతో అందరినీ కాపాడారు. విదేశాల కన్నా మన దేశం కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. మనల్ని 200 ఏళ్లు పాలించిన అమెరికా కూడా కరోనాను ఎదుర్కోలేక విలవిల్లాడింది. లక్షలాది మంది చనిపోయారు. ఆరోగ్యరంగంలో ఏంతో ముందున్న ఇటలీలోనూ 50 లక్షల మంది మరణించారు. అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నారు.'' అని ఆయన పేర్కొన్నారు.

    ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై యువత భగ్గుమన్న విషయం తెలిసిందే. ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యానని అన్నారు. ఆ వేషధారణతో ప్రజల్లోకి వెళ్లి.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. యువత రిప్ప్‌డ్ జీన్స్ కోసం మార్కెట్‌కు వెళుతున్నారని, అక్కడ అవి దొరకకపోతే జీన్స్ కొనుక్కుని కత్తెరలతో కట్ చేసుకుని మరీ ధరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. ఎట్టకేలకు ఆయన దిగొచ్చి, క్షమాపణలు చెప్పారు. అమెరికా భారత్‌ను పాలించిందని.. ఇప్పుడు మరోసారి విమర్శల పాలయ్యారు ఉత్తరాఖండ్ సీఎం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు