Urmila Matondkar: కాంగ్రెస్‌కు షాక్.. నటి ఊర్మిళ మటోండ్కర్ రాజీనామా

Urmila Matondkar: పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని.. స్వార్థం కోసం కొందరిని వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని ఆమె మండిపడ్డారు.

news18-telugu
Updated: September 11, 2019, 3:05 PM IST
Urmila Matondkar: కాంగ్రెస్‌కు షాక్.. నటి ఊర్మిళ మటోండ్కర్ రాజీనామా
ఊర్మిళ మటోండ్కర్
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీకి బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఊర్మిళ. పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని.. స్వార్థం కోసం కొందరిని వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఊర్మిళ.

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు ఊర్మిళ. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌లో చేరి 5 నెలలు మాత్రమే అయింది. కానీ అంతలోనే పార్టీకి గుడ్‌‌బై చెప్పారు.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading