
కాంగ్రెస్ తరుపున ముంబాయి నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రంగీళ భామ ఊర్మిళ
Lok Sabha Election 2019 | తాను హిందువులను అవమానించినట్లు బీజేపీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నిరాధారమని, బోగస్ అని ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ పేర్కొన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్న ‘రంగీల’ నటి ఊర్మిళ మటోండ్కర్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను హిందువులను అవమానించేలా వ్యాఖ్యాలు చేశానంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆమె స్పందించారు. తనపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు నిరాధారమని, బోగస్ అని అన్నారు. హిందుత్వపై తనకు నమ్మకం ఉందని, గౌరవం ఉందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
‘హిందుత్వం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటూ హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఊర్మిళ ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఓ టీవీ జర్నలిస్ట్‌పై కూడా ఈ విషయమై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ నఖువా కోరారు. దేశంలో హిందువులను ఊర్మిళ అవమానించారని... హిందువులను టెర్రరిస్టులుగా చూస్తున్నారంటూ సురేష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఊర్మిళపై భారత శిక్షా స్మృతిలోని 295ఏ, 505, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by:Janardhan V
First published:April 08, 2019, 11:38 IST