UP POLLS PHASE 7 PM MODI HOLDS MEGA ROADSHOW IN VARANASI OFFERS PRAYERS AT KASHI VISHWANATH TEMPLE AND PLAYS WITH DRUMPS PVN
UP Polls : కాశీలో డ్రమ్స్ మ్రోగించిన మోడీ..రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు
వారణాశిలో మోడీ రోడ్ షో
Modi Holds Mega Roadshow in Varanasi : వారణాసిలో ప్రధాని మోడీ మెగా రోడ్ షో నిర్వహించారు. సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేయడంతో ప్రారంభమైన ప్రధాని మోడీ రోడ్ షో.. మాల్దాహియా కూడలి నుంచి లోహ మండి స్క్వేర్, లాహురబీర్, పిప్లానీ కత్రా, కబీర్చౌరా, లోహటియా, మైదాగిన్, బులనాలా మీదుగా కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్న తర్వాత ముగిసింది .
Modi Road Show In Varanasi :ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం ఏడు దశలకు గాను ఇప్పటివరకు ఆరు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇక,చివరి దశ పోలింగ్ మార్చి-7న జరుగనుంది. ఏడో దశలో ప్రధాని మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ సర్వశ్తులు ఒడ్డుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. వారణాసిలో ప్రధాని మోడీ మెగా రోడ్ షో నిర్వహించారు. సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేయడంతో ప్రారంభమైన ప్రధాని మోడీ రోడ్ షో.. మాల్దాహియా కూడలి నుంచి లోహ మండి స్క్వేర్, లాహురబీర్, పిప్లానీ కత్రా, కబీర్చౌరా, లోహటియా, మైదాగిన్, బులనాలా మీదుగా కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్న తర్వాత ముగిసింది .
సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోలో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ప్రధాని కూడా ముకుళిత హస్తాలతో అందరినీ పలకరించారు. జై శ్రీ రామ్, హర్ హర్ మహాదేవ్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మోదీపై గులాబీ రేకుల వర్షం కురిపించారు. కాగా, 2014 లోక్సభ ఎన్నికల సమయంలో వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత వారణాసిలోని ఇదే స్థలం నుండి తన మొదటి రోడ్ షోను మోదీ ప్రారంభించారు.
రోడ్ షో అనంతరం ప్రధాని దర్శనం కోసం కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ మరోసారి భిన్నమైన రూపంలో కనించారు. దర్శనం కోసం కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్న ప్రధానికి అర్చకులు డప్పులు వాయిస్తూ స్వాగతం పలికారు. ఆలయం వెలుపల ప్రధాని మోడీ పూజారి చేతి నుండి డమరుని అందుకుని వాయించారు. ఈ సమయంలో మోదీ ముఖంలో తెలియని సంతోషం కనిపించింది.
అంతకుముందు మీర్జాపూర్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోడీ..ప్రపంచం ప్రస్తుతం సంక్షోభ కాలంలో ఉందని, ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని అన్నారు. ఓ వైపు కరోనా, మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గంగా ద్వారా వేలాది మంది భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నామని మోడీ చెప్పారు. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ కార్యక్రమంతో స్వదేశానికి తీసుకువచ్చిన విషయానని... అఫ్గానిస్థాన్ సంక్షోభ సమయంలో దేవీ భారత్ పేరుతో భారతీయుల తరలింపు ప్రక్రియ చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు. కరోనా పరిస్థితుల్లో అన్ని దేశాలు చేతులెత్తేశాయి కానీ పేదల కోసం భారత్ రూ. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించిందని... రూ.30 వేల కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో, రూ.1.25 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో వేసినట్లు మోడీ చెప్పారు. యూపీలో కుటుంబ పార్టీలను, మాఫియావాదీలను ఓడించాలని ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దేశభక్తితో కూడిన ప్రభుత్వం కావాలని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.