Home /News /politics /

UP POLLS CONGRESS WONT FIELD ANY CANDIDATE AGAINST AKHILESH HIS UNCLE SHIVPAL YADAV PVN

UP Polls : కాంగ్రెస్ సంచలన నిర్ణయం..అఖిలేష్,శివపాల్ పై పోటీకి దూరం


అఖిలేష్ యాదవ్(ఫైల్ ఫొటో)

అఖిలేష్ యాదవ్(ఫైల్ ఫొటో)

Congress On Akhilesh Yadav : గతంలో అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లు పోటీ చేసినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు.

Uttar Pradesh Assembly Elections :   మరికొద్ది రోజుల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విష యం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ఈసారి ఆసక్తికర పరిణామాల దిశగా సాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆయన బాబాయ్ శివపాల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. గతంలో అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లు పోటీ చేసినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మర్యాదపూర్వకంగా.. అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్ పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో,అఖిలేష్ బాబాయ్ శివపాల్ యాదవ్ పోటీ చేస్తున్న ఇటావా జిల్లాలోని జశ్వంత్ నగర్ నియోజకవర్గంలో అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది.

కాగా,అఖిలేష్ యాదవ్ తన కుటుంబ కంచుకోట అయిన మెయిన్‌పురి పరిధిలోని కర్హాల్ నుంచి తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 2012లో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఎమ్మెల్సీ అయ్యారు. కర్హాల్ లో మూడో దశలో పోలింగ్ లో భాగంగా ఫిబ్రవరి 20న ఓటింగ్ జరగనుంది. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ALSO READ UP Polls : అఖిలేష్ పై పోటీకి కేంద్రమంత్రిని దించిన బీజేపీ..ఇప్పుడుంటది అసలు పోరు

సమాజ్ వాదీ పార్టీ కంచుకోట అయిన మెయిన్ పురి జిల్లాలో ప్రతీ నియోజకవర్గం ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. మెయిన్ పురి లోక్ సభ స్ధానం నుంచి అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. దీంతో ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీటు కర్హాల్ నుంచి తాను బరిలోకి దిగాలని అఖిలేష్ నిర్ణయించుకున్నారు. కర్హాల్ నియోజకవర్గంలో 1.44 లక్షల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో అఖిలేష్‌కు ఇది సురక్షితమైన సీటుగా భావిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: 5 State Elections, Akhilesh Yadav, Congress, Samajwadi Party, Uttar Pradesh Assembly Elections

తదుపరి వార్తలు