UP POLLS AYODHYA SP CANDIDATE 7 YEAR OLD DAUGHTER IS THE STAR ATTRACTION IN CAMPAIGN TRAIL PVN
UP Polls : తండ్రి కోసం కూతురు..అయోధ్య ఎన్నికల ప్రచారంలో స్టార్ ఎట్రాక్షన్ గా ఏడేళ్ల బాలిక
అయోధ్యలో ఎన్నికల ప్రచారం చేస్తోన్న ఏడేళ్ల బాలిక
Ayodhya Assembly Seat : అయోధ్య నియోజకవర్గాన్ని యూపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంటాయి. సమాజ్ వాదీ పార్టీ ఈ సారి కూడా ఈ నియోజకవర్గంలో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది.
Uttar Pradesh Assembly Elections : దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుండగా..అధికారంలో కొనసాగేందుకు బీజేపీ అంతేస్థాయిలో కష్టపడుతోంది. ఇక,కాంగ్రెస్ పార్టీ,బహుజన్ సమాజ్ పార్టీ కూడా గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. నాయకులు, కార్యకర్తలతో వీధులన్నీ సందడిగా మారిపోయాయి. ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు, ఇంటింటా ప్రచారాలతో పోటీచేసే అభ్యర్థులు తీరిక లేకుండా గడుపుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడం కొంతమంది నేతలకు సాధ్యం కాని సందర్భాల్లో అభ్యర్థి తరఫున అతడి కుటుంబసభ్యులు, బంధువులు ప్రచారంలో పాల్గొనడం మనకు తెలిసిందే. యూపీ ఎన్నికల్లో భాగంగా..అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న తన తండ్రి విజయం కోసం ఓ ఏడేళ్ల చిన్నారి ప్రచారం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన ఆ చిన్నారి తండ్రి విజయం కోసం ఇంటింటా ప్రచారంలో పాల్గొంటోంది.
అయోధ్య నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున పవన్ పాండే సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయోధ్య నియోజకవర్గాన్ని యూపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గం బీజేపీ కంచుకోటగా ఉంది. 1991 నుంచి ఒక్కసారి మినహా ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నేత వేద్ ప్రకాష్ గుప్తా కొనసాగుతున్నారు.
అయితే 2012 ఎన్నికల్లో అయోధ్య సీటుని గెల్చుకున్న సమాజ్ వాదీ పార్టీ ఈ సారి కూడా ఈ నియోజకవర్గంలో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ పవన్ పాండే గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే పవన్ పాండే ఏడేళ్ల కుమర్తె గాయత్రి పాండే తన తండ్రి విజయం కోసం ఇంటింటా ప్రచారంలో పాల్గొంటోంది. "దయచేసి మా నాన్నకు ఓటేయండి. అఖిలేశ్ యాదవ్ జీ సీఎం అయితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి'అంటూ గాయత్రి పాండే ప్రచారం చేస్తోంది.ఈ బాలిక చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పవన్ పాండే భార్య మాట్లాడుతూ...."మా కుమార్తె గాయత్రి పాండే... రోజూ ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి ఆన్లైన్ తరగతులు ప్రారంభయ్యే ఉదయం 9.30 గంటలకు ముందే తన తండ్రితో కలిసి ప్రచారానికి వెళుతుంది. కరోనావైరస్ కారణంగా ఇవి కష్ట సమయాలు అయినప్పటికీ, ప్రచారంలో భాగం కావడానికి ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మేము ఆమెను బయటకు వెళ్లనివ్వడానికి అనుమతిస్తున్నాము"అని తెలిపారు.
కాగా,పవన్ పాండే 2012 శాసనసభ ఎన్నికల్లో అయోధ్య నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ పై విజయం సాధించి అఖిలేశ్ యాదవ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2017లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
ఉత్తర్ప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. అయోధ్య నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న (5వ దశలో) ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక,అయోధ్య నియోజకవర్గానికి బీజేపీ ఇప్పటివరకూ అభ్యర్థిని ప్రకటించలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.