రాజ్యాంగాన్ని మార్చడమంటే...భర్తలను మార్చినంత ఈజీకాదు...స్మృతి ఇరానీపై నోరుజారుడు

స్మృతి ఇరానీ పార్లమెంటులో, కేంద్ర మంత్రి గడ్కరీ పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ మాట్లాడుతుంటారు. అయితే రాజ్యాంగాన్ని మార్చడం అంటే భర్తలను మార్చినంత ఈజీకాదు అంటూ పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయ్‌దీప్ కవాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: April 2, 2019, 3:21 PM IST
రాజ్యాంగాన్ని మార్చడమంటే...భర్తలను మార్చినంత ఈజీకాదు...స్మృతి ఇరానీపై నోరుజారుడు
స్మృతి ఇరానీ
  • Share this:
ఎన్నికల వేళ కొందరు రాజకీయ నేతలు చవకబారు వ్యాఖ్యలతో పేరు సంపాదించే పనిలో పడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయ్‌దీప్ కవాడే ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వెగటుపుట్టిస్తున్నాయి. జయదీప్ మాట్లాడుతూ...స్మృతి ఇరానీ తరచూ రాజ్యాంగాన్ని మార్చమని అంటుంటారు...అయితే ఆవిడ గురించి నేను ఒక విషయం చెప్పదలచుకున్నా...స్మృతి ఇరానీ నుదుటిపై ఒక పెద్దగా బొట్టు పెట్టుకుంటుంది. అయితే సాధారణంగా భర్తలను మార్చే కొందరు మహిళలు వాళ్ల బొట్టు సైజు పెంచుతూ పోతుంటారు. అలాగే వారి నుదుటిన బొట్టు పరిణామం కూడా పెరుగుతూనే ఉంటుంది...అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంతే కాదు జయ్‌దీప్ కవాడే మరింత హద్దులు మీరుతూ...స్మృతి ఇరానీ పార్లమెంటులో, కేంద్ర మంత్రి గడ్కరీ పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ మాట్లాడుతుంటారు. అయితే రాజ్యాంగాన్ని మార్చడం అంటే భర్తలను మార్చినంత ఈజీకాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా మహిళా రాజకీయ నేతలను ఉద్దేశించి ఈ మధ్య కాలంలో నేతలు నోరుజారుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని ఉద్దేశించి సైతం ఇలాంటి వ్యాఖ్యలే వినిపించారు.
First published: April 2, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading