వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ Vs ప్రియాంక గాంధీ..

ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

UP Lok Sabha Election 2019 | కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీని ఢీకొనడం ఖాయంగా తెలుస్తోంది.

  • Share this:
    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గ బరిలో నిలవనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీని ప్రియాంక గాంధీ ఢీకొనడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమేథీకి చెందిన కాంగ్రెస్ నేతలు తాజా సంకేతాలిచ్చారు. అమేథీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వరుస ర్యాలీలు, బహిరంగ సభలతో యూపీలో ప్రియాంక గాంధీ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె వారణాసి నుంచి పోటీ చేసే అవకాశముందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    తాజాగా ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తారని దీపక్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ వారణాసిలోనే మకాం వేయనున్నట్లు చెప్పారు. ప్రియాంక గాంధీకి దీపక్ సింగ్ సన్నిహితుడు కావడంతో...ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి ఈ నెల 26న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
    First published: