Home /News /politics /

ప్రధాని పదవిపై విపక్ష నేతలకు అత్యాశ...సీఎం యోగి ఆదిత్యనాథ్ సెటైర్లు

ప్రధాని పదవిపై విపక్ష నేతలకు అత్యాశ...సీఎం యోగి ఆదిత్యనాథ్ సెటైర్లు

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

UP Lok Sabha Election 2019 | కేవలం 37-38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విపక్ష నేతలు కూడా తాము దేశ ప్రధాని కావాలని అత్యాసపడుతున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు.

    యూపీ విపక్ష నేతల మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెటైర్లు వేశారు. కేవలం 37-38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విపక్ష నేతలు కూడా తాము దేశ ప్రధాని కావాలని అత్యాశలకు పోతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ తరఫున దేవెగౌడ దేశ ప్రధాని కావడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ...ఆ రోజులు పోయాయని చెప్పారు. ప్రస్తుతం దేశ ప్రజలు కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దేశ ప్రధాని కావాలంటే 272 సీట్లు కావాలని, బీజేపీకి మాత్రమే ఆ సామర్థ్యం ఉందని ఏఎన్ఐ‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

    యూపీకి చెందిన వ్యక్తిని దేశ ప్రధానిగా ఎన్నుకోవాలంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపినివ్వడంపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ వారణాసి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారని, పరోక్షంగా ప్రధానికి మద్దతు తెలిపినందుకు మాయావతికి ధన్యవాదాలని పేర్కొన్నారు.

    బీఎస్పీ కూటమిలో తనకు విలువలేకుండా పోయిందని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. గతంలో ములాయం నేతృత్వంలో సమాజ్‌వాది పార్టీ యూపీలో 37 లోక్‌సభ స్థానాల్లో గెలవగా...ఇప్పుడు 37 స్థానాల్లో పోటీ చేసే స్థాయికి ఆ పార్టీ పరిస్థితి దిగజారిందని వ్యాఖ్యానించారు. బహిరంగ సభల్లో మాయావతి పెద్ద కుర్చీల్లో కూర్చొంటున్నారని, అఖిలేశ్‌కు చిన్న కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మాయావతిని కలిసేందుకు వెళ్లే అఖిలేష్‌ను ఇంటి బయటే షూలు విప్పాల్సిన దుస్థితి నెలకొంటోందన్నారు. ఈ అవమానాలతో అఖిలేశ్ యాదవ్ తమపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు.
    First published:

    Tags: Bjp, Lok Sabha Election 2019, Uttar pradesh, Uttar Pradesh Lok Sabha Elections 2019, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు