యూపీ మాజీ సీ‌ఎంకు ఎయిర్‌పోర్టులో అవమానం.. ఫ్లైట్ ఎక్కకుండా ఆపేసిన అధికారులు

మనదేశంలో వీవీఐపీలకు విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. అవి, కేంద్ర విమానయాన శాఖ ఆదేశాల మేరకే పరిమితమై ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రపు తాజా మాజీ ముఖ్యమంత్రికి అవమానం జరిగింది. అసలేం జరిగింది?

news18-telugu
Updated: February 12, 2019, 9:39 PM IST
యూపీ మాజీ సీ‌ఎంకు ఎయిర్‌పోర్టులో అవమానం.. ఫ్లైట్ ఎక్కకుండా ఆపేసిన అధికారులు
అఖిలేశ్ యాదవ్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: February 12, 2019, 9:39 PM IST
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు తాజా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన ఎప్పుడు జడ్ కేటగిరీ భద్రతతో ఉంటారు. అలాంటి వ్యక్తికి సొంత రాష్ట్రంలోని లక్నౌ విమానాశ్రయంలో తీవ్ర అవమానం ఎదురైంది. అధికారులు ఆయనను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ.. యూపీ రాష్ట్రంలో ఉన్న పాలనాతీరు అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే, అలహాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం సుమారు 201 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు లక్నౌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో బయల్దేరాలి. అయితే, షెడ్యూల్ ప్రకారం స్పెషల్ ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ అధినేతకు అధికారులు షాకిచ్చారు. ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి లేదంటూ నిరాకరించారు.

ఈ సందర్భంగా తనను చేయి అడ్డం పెట్టి ఆపేందుకు ప్రయత్నించిన అధికారిపై అఖిలేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ’’డోన్ట్ టచ్ మీ, హాత్ నికాలో..‘‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అఖిలేశ్ భద్రతా సిబ్బంది.. ఆ అధికారిని దూరంగా నెట్టేశారు. అడ్డుకోవడానికి గల కారణాలను తెలిపే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చూపించాలంటూ అఖిలేశ్ నిలదీశారు. ఫ్లైట్ ఎక్కేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లూ తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే, ఫ్లైట్ టేకాఫ్‌కు అనుమతి లభించకపోవడంతో ఆయన ఎయిర్ పోర్టు నుంచి వెనుదిరిగారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేశ్ యాదవ్.. యూపీలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. కావాలనే తనను విద్యార్థి యూనియన్ సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. విషయం ఏమిటంటే, అలహాబాద్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఎస్పీ అనుబంధ సంస్థ విజయం సాధించింది. ఆ సంఘానికి చెందిన విద్యార్థి నాయకుల ప్రమాణస్వీకారోత్సవానికి అఖిలేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే, యూనివర్సిటీలో జరిగే కార్యక్రమాలకు రాజకీయనాయకులు వెళ్లడాన్ని ప్రభుత్వ నిషేధించిన నేపథ్యంలో.. అధికారులు ఆయనను వెళ్లనివ్వలేదు. ఈ అంశంపై అఖిలేశ్ యాదవ్.. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...