UP ELECTIONS FINAL PHASE OF POLLING IN UTTAR PRADESH TODAY PVN
UP Elections : ఉత్తరప్రదేశ్ లో నేడే చివరి దశ పోలింగ్..మోడీ,అఖిలేష్ ఇలాకాలో కూడా ఇవాళే
ప్రతీకాత్మక చిత్రం
7th Phase UP Polling : ఏడో విడత అసెంబ్లీ ఎన్నికలు ఈస్ట్ ఉత్తర్‌ప్రదేశ్ లో జరగనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాజకీయ, భౌగోళిక విభిన్న పరిస్థితులు ప్రభావం అక్కడ బాగా ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా వారణాసి, మీర్జాపూర్, అజమ్‌గర్ డివిజన్లలోని 9 జిల్లాల్లో మిగిలిన 54 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండడడంతో అందరిలో ఆశక్తి నెలకొంది.
Final Phase Of Polling In Uttar Pradesh : ఫిబ్రవరి పదో తేదీన ప్రారంభమయి దాదాపు నెల రోజుల పాటు సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు నేటితో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లో చివరిదైన ఏడో దశ పోలింగ్ ఇవాళ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అవనుండగా..సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 54 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 613 మంది రంగంలో ఉన్నారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇవాళ పోలింగ్ జరగనుండడంతో ఏడో దశ పోలింగ్ ప్రాధాన్యం సంతరించుకొంది.
ఏడో విడత అసెంబ్లీ ఎన్నికలు ఈస్ట్ ఉత్తర్‌ప్రదేశ్ లో జరగనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాజకీయ, భౌగోళిక విభిన్న పరిస్థితులు ప్రభావం అక్కడ బాగా ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా వారణాసి, మీర్జాపూర్, అజమ్‌గర్ డివిజన్లలోని 9 జిల్లాల్లో మిగిలిన 54 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండడడంతో అందరిలో ఆశక్తి నెలకొంది. వారణాసిలో మోడీ, అజమ్‌గర్ లో అఖిలేష్ హవా కొనసాగుతోంది. వారణాసిలో మోదీ, అజమ్ గర్ లో అఖిలేష్ హవా ఎంత వరకు వీయనుందో తేలనుండడం ఆసక్తిని పెంచుతోంది.
వారణాసి, పొరుగు జిల్లాల్లో ప్రధాని మోడీ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక నాలుగు రోజుల పాటు ప్రచారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ మిత్రపక్షమైన ఎస్పీ నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన నాయకులంతా కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు.
చివరి దశ పోలింగ్ లో పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. చివరిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నీల్కాంత్ తివారీ ఉన్నారు. ఈయన వారణాసి సౌత్ నియోజక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరోవైపు శివ్‌పుర్-వారణాసి నియోజక వర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాసి నార్త్ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్‌పుర్ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మీర్జాపుర్ నుంచి రామశంకర్ సింగ్ పటేల్‌లు పోటీపడుతున్నారు. అంతేగాకుండా క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన ధారాసింగ్ చౌహాన్ ఘోశి నుంచి పోటీలో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలు, ఫిబ్రవరి 10న పోలింగ్ జరిగింది. రెండో దశలో 9జిల్లాల్లోని 55 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్, మూడో దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు ఫిబ్రవరి 20న , నాలుగో దశలో 9 జిల్లాల్లోని 60 స్థానాలకు ఫిబ్రవరి 23న , ఐదో దశలో 11 జిల్లాల్లోని 60 స్థానాలకు ఫిబ్రవరి 27న , ఆరో దశలో 10 జిల్లాల్లోని 57 స్థానాలకు మార్చి 3న పోలింగ్ జరిగింది. ఇక చివరి ఏడో దశలో 9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో మార్చి 7న పోలింగ్ జరగనుంది. మార్చి 10న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.