Home /News /politics /

UP ELECTIONS 2022 VOTING UPDATES BJP TO WIN RECORD SEATS UNDER PM MODI LEADERSHIP SAYS CM YOGI ADITYANATH SK

UP Assembly Elections 2022: యూపీలో ప్రశాంతంగా ఆరో దశ పోలింగ్.. ఓటువేసిన సీఎం యోగి

ఓటు వేసిన సీఎం యోగి

ఓటు వేసిన సీఎం యోగి

UP Assembly Elections: మొత్తం ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశలు ముగిశాయి. నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది.

  యూపీలో ఆరో విడత ఎన్నికల (UP Sixth Phase assembly Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. ఐతే కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై.. వాటి స్థానాల్లో వేరే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాళ 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 675 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోరఖ్‌పూర్‌(Gorakhpur)లోని ఓ పోలింగ్ కేంద్రంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉదయం 9 గంటల వరకు 8.69శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికలు అధికారులు తెలిపారు.  ఆరో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేశారు. కానీ ఇప్పుడే తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక పతార్‌దేవా నుంచి సూర్యప్రతాప్ సాహి, ఎత్వా నుంచి సతీష్ చంద్ర ద్వివేది, బన్సి నుంచి జైప్రతాప్ సింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఆరోదశ ఎన్నికల్లో 80శాతం సీట్లు తమకే వస్తాయని స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్నారు సీఎం యోగి.

  ఖార్కివ్‌లో మావాళ్లంతా సేఫ్‌గా ఉండేలా చూడండి..పుతిన్‌ని ఫోన్‌చేసిన నరేంద్ర మోదీ  ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఎన్నికల సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ఉన్న వారినే పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రం ముందు పోలీస్ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలుచేపట్టారు.

  Railway New Rule: ఇకపై అలా చేస్తే నేరమే.. రైల్వేలో కొత్త రూల్.. తక్షణం అమలులోకి..

  మొత్తం ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశలు ముగిశాయి. నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ (BJP), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. వీరితో పోల్చితే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి యూపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. అంతా తానై నడిపిస్తున్నారు.

  2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయ తెలిసిందే. మొత్తం 403 సీట్లుంటే.. అందులో 312 స్థానాలను బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు గెలిచాయి. ఈసారి కూడా తామే గెలుస్తామని బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. కమలం పార్టీని చిత్తుగా ఓడిస్తామని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా ఢంకా బజాయిస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: UP Assembly Elections 2022, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు