UP ELECTION ANOTHER RELATIVE OF MULAYAM SINGH YADAV JOINS BJP PVN
UP Election : అఖిలేష్ కి మరో షాక్..బీజేపీలో చేరిన ములాయం తోడల్లుడు
బీజేపీలో చేరిన ములాయం తోడల్లుడు
Uttar Pradesh Election : సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు, ప్రస్తుత ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మరదలు అపర్ణా యాదవ్ బుధవారం కాషాయ కండువా కప్పుకున్న తెలిసిందే. తాజాగా అఖిలేష్ కుటుంబం నుంచి మరొకరు బీజేపీలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు,ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు.
Pramod Gupta : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నవేళ అన్ని పార్టీల్లో నేతల పార్టీ చేరికల పర్వం కొనసాగుతోంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు, యూపీ మాజీ సీఎం, ప్రస్తుత ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మరదలు అపర్ణా యాదవ్ ఎర్రటోపీ(ఎస్పీ ఐడియాలజీ సిబంల్)ని పక్కనపెట్టి బుధవారం కాషాయ కండువా కప్పుకున్న తెలిసిందే. బీజేపీలోకి అపర్ణ చేరిక ఎన్నికల వేడిని మరింత రాజేసింది.
అయితే తాజాగా అఖిలేష్ కుటుంబం నుంచి మరొకరు బీజేపీలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు,ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు. లక్నోలో పార్టీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ బాజ్పాయ్ సమక్షంలో ప్రమోద్ గుప్తా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాఫియాలు, నేరగాళ్లకు సమాజ్ వాదీ పార్టీ ఆశ్రయమిస్తోందని, అఖిలేశ్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో తన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ములాయం సింగ్,శివపాల్ యాదవ్ లను అఖిలేష్ వేధించారని ఆరోపించారు.
ప్రమోద్ గుప్తాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ప్రియాంక మౌర్య కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ ప్రచారంలో ప్రియాంక మౌర్య పోస్టర్ గర్లగా ఉండి కీలకంగా వ్యవహరించిన విసయం తెలిసిందే. బీజేపీలో ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగనుందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. బీజేపీ 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. వీరిలో 44 మంది ఓబీసీలు, 43 మంది అగ్ర వర్ణాలకు చెందినవారు, 19 మంది ఎస్సీలు ఉన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.