UP Election : యూపీలో మళ్లీ బీజేపీనే..అఖిలేష్ కి కష్టమేనన్న తాజా సర్వే
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
UP Openion Poll : మరికొన్ని రోజుల్లోనే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పైనే అందరి దృష్టి ఎక్కువగా ఉంది. తాజాగా జీ న్యూస్ నిర్వహించిన ఒపినీయన్ పోల్ లో ఉత్తరప్రదేశ్ లో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వచ్చే అవకాశముందని తేలింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కూటమికి
UP Openion Poll : మరికొన్ని రోజుల్లోనే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,పంజాబ్,గోవా,మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అయితే ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) పైనే అందరి దృష్టి ఎక్కువగా ఉంది. ఎందుకంటే దేశంలో కీలక రాజకీయ పరిణామాలను నిర్ణయించేంది ఉత్తరప్రదేశ్ అని విశ్లేషకులు భావిస్తారు. దేశ ప్రధానిని గెలిపించాలన్నా.. ఓడించాలన్నా ఉత్తరప్రదేశ్ ఫలితాలను బట్టి తేలనుంది. ఇక,2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జయాపజయాలు యూపీ ఎన్నికలపైనే ఆధారపడి ఉంటాయన్నది విశ్లేషకుల మాట. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలు సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరించాయి.
తాజాగా జీ న్యూస్ నిర్వహించిన ఒపినీయన్ పోల్ లో ఉత్తరప్రదేశ్ లో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వచ్చే అవకాశముందని తేలింది. ఒపినీయన్ పోల్స్ నిర్వహించడంలో సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ అయిన "డిజైన్ బాక్స్డ్( Design Boxed)"తో కలిసి జీ న్యూస్ సంయుక్తంగా ఈ అభిప్రాయ సేకరణను నిర్వహించింది. పలు రకాల ప్రశ్నలతో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
ఈ సర్వే ప్రకారం..మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీకి 245-267 సీట్లు వచ్చే అవకాశముండగా, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కూటమికి 125-148సీట్లు ,మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 5-9సీట్లు రావచ్చునని,కాంగ్రెస్ కేవలం 3-7సీట్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇక,ఓట్ల శాతం విషయానికొస్తే..బీజేపీకి 41శాతం,సమాజ్ వాదీ పార్టీకి 34శాతం,బీఎస్పీకి 10శాతం,కాంగ్రెస్ కి 6శాతం,ఇతరుకు మూడు శాతం లోపు ఓట్లు రావచ్చునని ఈ సర్వే తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన సీఎం అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నకు...ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవికి ప్రజల మొదటి ఛాయిస్‌గా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. సర్వేలో పాల్గొన్నవారిలో 47శాతం మంది యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపగా, 35శాతం మంది ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. కేవలం 9శాతం మంది మాయావతిని కోరుకుంటున్నారని, 5 శాతం మంది ప్రియాంక గాంధీ వాద్రా తదుపరి యూపీ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఈ ఒపీనియన్ పోల్ తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.