వారణాసి బరిలో ప్రియాంక గాంధీ?...సస్పెన్స్ కొనసాగిస్తున్న రాహుల్

ఉత్తరప్రదేశ్‌లో 5, ఢిల్లీలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 9,ఒడిశా 2, తెలంగాణ 2, జమ్మూకాశ్మీర్ 2, హిమాచల్ ప్రదేశ్ 1, గోవా 1, జార్ఖండ్ 5, ఉత్తరాఖండ్ 2, ఈశాన్య రాష్ట్రాలు (7- 10).

UP Election 2019: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

 • Share this:
  యూపీలోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢీకొంటారా? లేదా? అనే విషయంలో సస్పెన్స్ వీడడంలేదు. ఈ అంశంపై నెలకొన్న సస్పెన్స్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  కొనసాగిస్తున్నారు. వారణాసిలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ బరిలో నిలపనున్నట్లు గత కొన్ని రోజలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

  వారణాసి నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఇటీవల ప్రియాంక గాంధీ స్వయంగా సంకేతాలిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే, తాను తప్పక బరిలో నిలుస్తానని ఆమె వ్యాఖ్యానించారు. ప్రియాంక ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయంలో పార్టీయే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో నిలవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

  ahmed patel, sambalpur observer, election commision, pm modi chapper checking, ఎన్నికల సంఘం, సంబల్‌పూర్, ఈసీ తనిఖీలు, ప్రధాని మోడీ హెలికాప్టర్
  ప్రధాని నరేంద్ర మోడీ


  ఈ నేపథ్యంలో వారణాసి నుంచి ప్రియాంక గాంధీ బరిలో నిలుస్తారన్న కథనాలపై ‘ది హిందూ’ పత్రిక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ కథనాలను ఆయన అంగీకరించడంకానీ...తిరస్కరించడంకానీ చేయలేదు. ఈ విషయంలో మిమ్మల్ని సస్పెన్స్‌లోనే ఉంచుతానని వ్యాఖ్యానించారు. సస్పెన్స్ అన్ని వేళలా చెడుకాదని అన్నారు.
  First published: