కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసుపెట్టిన నానమ్మ.. ఆమె టార్చర్ భరించలేకపోతున్నా..

ప్రాపర్టీ విషయంలో తన వేధిస్తోందని.. మీరే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: August 28, 2020, 7:52 AM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసుపెట్టిన నానమ్మ.. ఆమె టార్చర్ భరించలేకపోతున్నా..
అదితి సింగ్
  • Share this:
ఓ ఎమ్మెల్యేపై ఆమె నానమ్మే కేసు పెట్టింది. ఆస్తి కోసం తనను టార్చర్ పెడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీలో ఈ ఘటన జరిగింది. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ (కాంగ్రెస్)పై ఆమె నాన్నమ్మ కమలా సింగ్ కేసుపెట్టింది. ప్రాపర్టీ విషయంలో తన వేధిస్తోందని.. మీరే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణ బాధ్యతలను అడిషనల్ ఎస్పీ నిత్యానందరాయ్‌కి అప్పగించారు జిల్లా ఎస్పీ.

ఆగస్టు 10న రాయ్ బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే అదితి సింగ్‌పై కేసు నమోదయింది. ఇది ఆస్తి తగాదాలు, వేధింపులకు సంబంధించిన కేసు. ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు అడిషనల్ ఎస్పీని నియమించాం. ఇప్పటి వరకు ఎవరి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు.
జిల్లా ఎస్పీ


85 ఏళ్ల కమలా సింగ్ మహారాజ్ గంజ్‌లోని లాలుపూర్‌లో నివసిస్తోంది. అదితి సింగ్‌తో పాటు మరికొందరు తమ బంధువులు 2019, డిసెంబరు 30న ఇంట్లోకి వచ్చి గొడవ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆస్తిని తన పేర రాయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు తెలిపింది. కేసు నమోదైన తర్వాత ఎమ్మెల్యే ఫోన్ కాల్స్‌‌కు స్పందించడం లేదని పోలీసులు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Published by: Shiva Kumar Addula
First published: August 28, 2020, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading