Home /News /politics /

UP CM YOGI ADITYANATH SAID THAT PRIYANKA SHOULD THANKFUL TO PM MODI FOR THAT PS

ప్రియాంకా.. మోదీకి థ్యాంక్స్ చెప్పుకో: యోగి ఆదిత్యనాథ్

యోగి, ప్రియాంక ఫైల్ ఫొటోలు

యోగి, ప్రియాంక ఫైల్ ఫొటోలు

కేంద్రంలో అధికారం సాధించాలంటే రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెండోసారి రాష్ట్రపర్యటనకు వచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా.. భిన్నమార్గాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. గంగానదిపై తన యాత్రను చేపట్టారు ప్రియాంక. పరివాహక ప్రాంతాల ప్రజలను పలుకరిస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు.

ఇంకా చదవండి ...

    అయితే, ప్రియాంక గాంధీ గంగానది యాత్రపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. గంగానదిపై ప్రయాణం హాయిగా సాగుతున్నందుకు... ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ ధన్యవాదాలు చెప్పుకోవాలన్నారు. ప్రియాంక గాంధీ ప్రయాణం సాఫీగా సాగుతోందంటే.. గంగానదిని బీజేపీ ఎంత శుభ్రంగా మార్చివేసిందో అర్థమవుతోందన్నారు. ప్రియాంక గాంధీ ఒక్కరే కాకుండా.. ఎస్పీ, బీఎస్పీ నేతలను వెంట తీసుకుని గంగానదిపై ప్రయాణం చేయాల్సిందన్నారు. ఇప్పటికైనా, గంగా నదిని బీజేపీ చిత్తశుద్ధితో ప్రక్షాళన చేపట్టిందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

    గంగా నదిపై ప్రయాణం చేస్తూ పలు నియోజకవర్గాల ప్రజలను కలుసుకుంటున్న ప్రియాంక గాంధీ... బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీ నాయకులు పైకి చెబుతున్న అభివృద్ధికి.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కనిపించడం లేదన్నారు. తన పర్యటనలో అన్ని వర్గాల ప్రజలనూ కలుసుకుంటున్నానని, మోదీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని విమర్శించారు.

    ఇక, ప్రియాంక గాంధీ కాశీవిశ్వనాథాలయాన్ని సందర్శించనుండడంపై తనదైన స్టైల్లో స్పందించారు యోగి. ఆమె కాశీ విశ్వనాథ మందిరాన్ని సందర్శించడంపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. హిందూ వ్యవస్థలో ఎవరైనా ఆలయాన్ని సందర్శించవచ్చని చెప్పారు. శుద్ధత లేని ఆలయాన్ని సందర్శిస్తే శుద్ధులుగా మారుతారని యోగి.. ప్రియాంకపై సెటైర్ వేశారు.
    First published:

    Tags: Priyanka Gandhi, Uttar pradesh, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు