హోమ్ /వార్తలు /National రాజకీయం /

Lakhimpur: లఖింపూర్​ ఖేరీ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సీరియస్​.. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని వెల్లడి

Lakhimpur: లఖింపూర్​ ఖేరీ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సీరియస్​.. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని వెల్లడి

యూపీ సీఎం యోగి

యూపీ సీఎం యోగి

రైతుల చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని, ఎవరూ ఆందోళనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని సీఎం ఆదిత్యనాథ్​ ప్రజలను కోరారు.

ఇంకా చదవండి ...

లఖింపూర్ ఖేరీ కారు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం (government) లోతుగా దర్యాప్తు చేస్తుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి (Uttar Pradesh CM) యోగి ఆదిత్య నాథ్‌ (Yogi Aditya Nath) ప్రకటించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ఘటనపై సీఎం (CM) విచారం వ్యక్తం చేశారు. రైతుల చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని, ఎవరూ ఆందోళనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని సీఎం ఆదిత్యనాథ్​ ప్రజలను కోరారు. దర్యాప్తు పూర్తి కాకుండా ప్రజలు ఎలాంటి నిర్ధారణకు రావద్దని సూచించారు.

ఏం జరిగింది?

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra), ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. అయితే అక్కడ హింస చెలరేగడంతో ఎనిమిది మంది మరణించినట్టుగా తెలిసింది.  లఖింపూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఆదివారం ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్య మంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొనాల్సి ఉంది. అయితే వీరి పర్యటనకు వ్యతిరేకంగా టికోనియా-బన్‌బీర్‌పూర్ రహదారి వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి మీదకు రెండు ఎస్‌యూవీ వాహనాలు దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన రైతులు.. రెండు ఎస్‌యూవీ వాహనాలను తగలపెట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

లఖింపూర్‌ ఘటనలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఇందులో నలుగురు రైతులు (four formers) ఉన్నట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ (BJP) తన కార్యకర్తలలో నలుగురు మరణించారని ప్రకటించింది. పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ADG లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ కూడా లఖింపూర్ చేరుకున్నారు.

లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు (Oppositions) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు (central minister son) కారెక్కించడం దారుణమంటున్నారు. కాంగ్రెస్, బహుజన్​ సమాజ్​వాదీ పార్టీ (BSP), సమాజ్​వాదీ పార్టీ (SP) సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి. కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi wadhra) రేపు లఖింపూర్ ఖేరిని సందర్శిస్తానని ప్రకటించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కూడా ఈ ఘటనపై స్పందించారు. రైతులు చనిపోయినా స్పందించని సీఎం యోగి ఆదిత్యనాథ్​ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bjp, Died, Farmers, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు