ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Aditya nath) సారథ్యంలోని మంత్రివర్గంలో కొత్తగా ఏడుగురికి (Seven new faces) చోటు కల్పించారు. కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాద్, మరో ఆరుగురు కొత్త మంత్రులుగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని గాంధీ భవన్‌లో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. జితిన్ ప్రసాద (jithin prasadha)తో పాటు ఛత్రపాల్ సింగ్, పట్లు రామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేష్ ఖడిక్, ధర్మవీర్ ప్రజాపతి ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (UP Assembly)కి వచ్చే ఏడాది (next year) ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున మంత్రివర్గ విస్తరణ ప్రాధాన్యం సంతరించుకుంది. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ (BJP) ఎన్నికలకు వెళ్తుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
ఎన్నికలే లక్ష్యం..
యోగి ప్రభుత్వంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 23 మంది క్యాబినెట్ మంత్రులు, తొమ్మిది మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యతలు), 21 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. యూపీలో రానున్న ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. అందుకే గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది ఆ పార్టీ. ఇప్పటికే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో యూపీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. తాజాగా యూపీ కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టింది. 2022 ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)కు ముందు బిజెపి తన మిత్రపక్షాలతో పొత్తులపై పావులు కదుపుతోంది.
యూపీనే అత్యంత కీలకమని..
కొద్దిరోజుల క్రితం కేంద్ర కేబినెట్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్ యూపీ నుంచి ఏడుగురు ఎంపీలకు చోటు కల్పించారు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో యూపీ ఎంపీల సంఖ్య 14కు చేరింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కేంద్ర మంత్రులు (central ministers) ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. కేంద్రంలో ఈ రాష్ట్రం నుంచి ఇంత మందికి మంత్రి పదవులు దక్కడం ఇదే ప్రథమం. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారికి మంత్రి పదవులు కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఇదే కోవలో యూపీ మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.
బెంగాల్ దెబ్బతో..
ఇటీవల పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై బాజపా ఎక్కువ దృష్టి పెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాలను | కైవసం చేసుకొనేందుకు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడాన్ని కేంద్రం కీలకంగా బావిస్తోంది.. యూపీలో గత ఎన్నికల్లో మొత్తం 103 స్థానాలకుగాను భాజపా 312 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cabinet Reshuffle, Politics, Union cabinet, Uttar pradesh, Yogi adityanath