Home /News /politics /

UP BJP LEADER TOUCHES PM MODI FEET HERES HOW PM MODI REACTED WATCH VIDEO PVN

Viral Video : గొప్పొడివయ్యా.. తనకు పాదాభివందనం చేయబోయిన నేత కాళ్లే పట్టుకున్న మోదీ

ప్రధాని మోదీ పాదాభివందనం

ప్రధాని మోదీ పాదాభివందనం

Modi ToucheS UP BJP Leader Feet : ఇదంతా చూసిన నేతలు, బీజేపీ శ్రేణులు..ప్రధాని మోదీ హుందాతనం అంటే ఇదేనంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BJP leader touches PM Modi feet : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఓ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ప్రవర్తించిన విధానం అందర్ని ఆకట్టుకుంటోంది. తనకు పాదాభివందనం చేస్తున్న బీజేపీ నాయకుడిని వద్దని వారించిన మోదీ...ఆ తర్వాత ఆయన కాళ్లకే నమస్కరించారు. ఇదంతా చూసిన నేతలు, బీజేపీ శ్రేణులు..ప్రధాని మోదీ హుందాతనం అంటే ఇదేనంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూపీ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఉన్నావ్‌ లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి రాగానే బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియార్‌ శ్రీరాముడి విగ్రహాన్ని మోదీకి బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించేందుకు అవధేష్ కతియార్ ప్రయత్నించారు. పాదాభివందనం చేస్తున్న కతియార్ ను ప్రధాని మోదీ వంగి ఆపి, తన పాదాలను తాకవద్దని సంకేతాలు ఇచ్చారు. ఇలా చేయవద్దంటూ.. ఆయనకు సూచించిన అనంతరం ఆయనకే నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ కనిపించారు.


దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో..మోదీ అభిమానులు ఆయనని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అవధేష్ కతియార్ గతంలో ఉన్నావ్‌లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఉన్నావ్ జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్నవ్ జిల్లాలో ఫిబ్రవరి 23 న నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా..ఇప్పటివరకు మూడు దశల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే .చివరి దశ మార్చి 7న జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

ఇక,ఆదివారం నాటి ఉన్నావ్ ర్యాలీలో ప్రధాని మోదీ అఖిలేష్ యాదవ్ తోపాటు ప్రాంతీయ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. వారంతా వారి ప్రయోజనం కోసమే చూసుకుంటారని.. బీజేపీ అందరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Pm modi, UP Assembly Elections 2022, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు