Home /News /politics /

UP ASSEMBLY RESULTS SHOW THE PEOPLE WHO GAVE ZERO MARKS TO THE AIMIM OUT OF 100 SEATS SNR

Uttar Pradesh: 100 స్ధానాల్లో పోటీ చేస్తే ఒక్కచోటే డిపాజిట్..ఎంఐఎంకి జీరో మార్స్క్ వేసిన యూపీ ఓటర్లు

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Uttar Pradesh: ఏఎంఐఎం పార్టీ ఆశలు, ఆలోచనలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేసి సెంచరీ కొడతామన్న అసదుద్దీన్ స్టేట్‌మెంట్‌ వేస్ట్‌ అయిపోయింది. వంద సీట్లు కాదు కదా బీజేపీ హవా ముందు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోగా..99స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైపోయాయి.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజలు విపక్షాలను ఓటు అనే ఆయుధంతో చావు దెబ్బ కొట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా బీజేపీ గెలుచుకున్న స్థానాలతో పోలిస్తే మజ్లీస్‌ పార్టీ అధ్యక్షుడు (AIMIM President)అసదుద్దీన్‌ ఓవైసీ(Asaduddin owaisi) , సమాజ్‌వాది పార్టీ అఖిలేష్‌ యాదవ్(Samajwadi party Akhilesh yadav, బహుజన్‌ సమాజ్‌వాది (Bahujan samaj party) అధినాయకురాలు మాయావతి(Mayawati)కి ప్రజలు హోల్‌సేల్‌గా కోలుకోలేని దెబ్బ కొట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందు నుంచే వంద సీట్లు సాధిస్తామంటూ గెలుపు రాగం అందుకున్న ఏఐఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh2022)అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొక్కబోర్ల పడింది. కనీసం 2017 ఎన్నికల ఓట్లశాతంతో పోలిస్తే రెండు శాతం ఎక్కువ ఓట్లు సంపాధించలేకపోవడం చూస్తుంటే మజ్లీస్‌ పార్టీకి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది. ఒక్క ముభారక్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షా అలాం అలియాస్ గుడ్డు జమాలి మినహా ఏ ఒక్కరు కనీసం ఓట్ల శాతం సంపాధించుకోలేకపోయారు. వంద అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటి మినహా 99నియోజకవర్గాల్లో మజ్లీస్ అభ్యర్ధులకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయంటే యూపీలో బీజేపీ హవా ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. యూపీ ఎన్నికల సమయంలో ప్రచారంలో సెంచరీ తప్పక కొడతామని ఢంకా భజాయించిన అసదుద్దీన్‌ ఓవైపీసి మైనార్టి ఓట్లు కూడా పడలేదని అర్ధమవుతుంది. అత్యధిక ముస్లిం ఓటర్లు కలిగిన నియోజకవర్గం డియోబాంద్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గాన్ని ఎంఐఎం అభ్యర్ధిగా మౌలానా ఉమీర్ మదానికి కేటాయించినప్పటికి ఫలితం లేకపోయింది. కేవలం 3501 ఓట్లకు మించి సంపాధించుకోలేకపోయారు అక్కడ మజ్లీస్ పార్టీ నాయకుడు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ ఎన్నో వ్యూహాలు రచించి అభ్యర్దులను నిలబెట్టినప్పటికి ప్రయోజనం మాత్రం శూన్యంగానే తేలింది.

బీజేపీ ప్రభంజనంలో ఎంఐఎం గల్లంతు..
ముఖ్యంగా వారణాసి నార్త్‌ అసెంబ్లీ సీటును నాన్‌ ముస్లిం క్యాండిడెడ్‌ హరీష్‌ మిశ్రాకి సీటు కేటాయించి కొత్త స్ట్రాటజీని ఫాలో అయింది మజ్లీస్‌ పార్టీ. అయితే ఇక్కడ కూడా అసదుద్దీన్‌ ఓవైసీ పాచిక పారలేదు కదా..కనీసం అభ్యర్ధి ఉనికిని కూడా చాటులేకపోయారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈసారి మజ్లీస్‌ పార్టీ యూపీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు గెలవకపోగా..కనీసం ఓట్ల శాతాన్ని కూడా పెద్దగా పెంచుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకుల వాదనగా తెలుస్తోంది. 2017ఎన్నికల్లో యూపీలో ఎంఐఎం 38మంది అభ్యర్ధులు పోటీ చేస్తే మొత్తం రెండు లక్షల ఓట్లు పడ్డాయి. ఈసారి అంటే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 100 సైన్యాన్ని బరిలోకి దింపితే ఒక్కరు గెలవకపోగా...కేవలం 22లక్షల ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద చూసుకుంటే 2017 ఎన్నికల్లో ఎలాంటి హడావుడి చేయకుండా కేవలం 38మంది అభ్యర్ధులతో బరిలోకి దిగిన మజ్లీస్ పార్టీకి 0.2శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి భారీ ప్రచారం, వంద మంది పోటీలో నిలబెట్టడం, కచ్చితంగా గెలుస్తాం, బీజేపీని ఇంటికి పంపిస్తామంటూ అసదుద్దీన్‌ చేసిన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ప్రజల ఓట్లను రాబట్టలేకపోయింది. గతంలో కంటే రెండు శాతం అధికంతో కేవలం 0.4శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది మజ్లీస్‌ పార్టీ. యూపీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావిస్తామన్నారు మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ. రెండో సారి బీజేపీకి అధికారం కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. మేం వేసుకున్న అంచనాలు ఫలించలేదని..మరోసారి ప్రజాక్షేత్రంలో తమ బలాన్ని నిరూపించుకుంటామని చెప్పారు.


అసెంబ్లీ ఎన్నికల్లో జీరో మార్క్స్ వేసిన ఓటర్లు..
ఒకరకంగా మజ్లీస్‌ పార్టీ దూకుడుకు యూపీ ఫలితాలు కళ్లెం వేసినట్లైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పరస్పర విమర్శలు చేసుకున్నా ..ఎన్ని వాగ్ధానాలు ఇచ్చినా అల్టిమేట్‌గా ప్రజలు తాము అనుకున్నట్లుగానే తీర్పు ఇస్తారని ఫలితాల తర్వాత మజ్లీస్‌ పార్టీ అధినాయకత్వానికి బోధపడినట్లుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిభింబం అని ప్రధాని మోదీ చెప్పిన సింగిల్ డైలాగ్‌తోనైనా ఏఎంఐఎం పార్టీ ఫలితాల ద్వారా వచ్చిన లాభ,నష్టాల్ని బేరిజు వేసుకొని భవిష్యత్‌ ఎన్నికల ప్రణాళికను రచించుకుంటే మంచిదనే సలహా కూడా ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
Published by:Siva Nanduri
First published:

Tags: AIMIM, Assembly Election 2022, Bjp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు