• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • UNION RAILWAY MINISTER PIYUSH GOYAL CRITICIZES TELANGANA CM KCR AK

కవితను ఓడించి... కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు

కవితను ఓడించి... కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు

కేసీఆర్, కవిత (ఫైల్ ఫోటో)

తెలంగాణలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందని... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

 • Share this:
  కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కూతురు కవితను ఓడించటం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతం పంపారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందని... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం గోయల్ మీడియాతో మాట్లాడారు. అవగాహన లోపంతోనే కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు.

  సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం బాధాకరమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని మండిపడ్డారు. పక్క దేశాల్లో మతహింసకు గురవుతోన్న వారికి ఆశ్రయమిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలను అసదుద్దీన్ ఒవైసీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. నేడు లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసైన రోజు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తుచేశారు.

  కవితను ఓడించి... కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు | Union railway minister piyush goyal criticizes telangana cm kcr ak
  పీయూష్ గోయల్ (File)


  తెలంగాణకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణం అని చెప్పుకొచ్చారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.2,602 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఎంపీలు అరవింద్, సంజయ్, బాపూరావులు తెలంగాణ కోసం అడిగినవన్నీ చేస్తున్నామని గోయల్ తెలిపారు. బీజేపీ తెలంగాణ ఎంపీలు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు.
  Published by:Kishore Akkaladevi
  First published: