కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం సమావేశమయ్యారు. ప్రహ్లాద్ జోషి వెంట పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఉన్నారు. త్వరలో 17వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వారు సోనియాతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. లోక్‌సభలో బడ్జెట్ సమావేశాలపై చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వానికి సహకరించాలని సోనియాగాంధీని కోరారు.
Delhi: Union Parliamentary Affairs Minister Prahlad Joshi, MoS Parliamentary Affairs Arjun Ram Meghwal and Minister of Agriculture and Farmers Welfare Narendra Singh Tomar, met UPA Chairperson Sonia Gandhi at her residence ahead of upcoming parliament session pic.twitter.com/V122PcEP8C
— ANI (@ANI) June 7, 2019
17వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 17న ప్రారంభంకానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండగా...19 తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 20న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. జులై 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జులై 26 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.
సోనియాగాంధీతో భేటీ అనంతరం...రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో డీఎంకే పక్ష నేత టీఆర్ బాలుతోనూ ప్రహ్లాద్ జోషి సమావేశమయ్యారు. లోక్‌సభ సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలని వారు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.