news18-telugu
Updated: April 2, 2019, 3:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికల వేళ బీజేపీకి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. నమో యాప్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా విరాళాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం తన వంతుగా రూ.వెయ్యి డొనేట్ చేశారు. నమో యాప్ ద్వారా పేమెంట్ చేసిన అనంతరం రసీదును ట్విటర్లో పోస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలంతా ఎంతో కొంత పార్టీకి విరాళం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీరిచ్చే చిన్న మొత్తం న్యూ ఇండియాను నిర్మించాలన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ఐతే కేంద్రమంత్రి పదవిలో ఉండి అంత తక్కువ విరాళం ఇవ్వడంపై కొందరు నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. మీ కోసం పార్టీ ఎంతో ఖర్చుపెడితే మీరు మాత్రం వెయ్యి రూపాయలిస్తారా? అంటూ విమర్శిస్తున్నారు.
ఐతే కార్యకర్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తక్కువ మొత్తంలో విరాళం ఇస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్టీని నడిపించడానికి బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఆధారపడే పరిస్థితి పోవాలని స్పష్టంచేశారు. మన పార్టీని మన డబ్బులతోనే నడుపుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, గతంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు సైతం రూ.వెయ్యి మాత్రమే విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.
Published by:
Shiva Kumar Addula
First published:
April 2, 2019, 3:13 PM IST