Home /News /politics /

UNION MINISTER OF STATE FOR PETROLEUM AND NATURAL GAS RAMESHWAR TELI HAS MADE CONTROVERSIAL STATEMENTS ON THE RISE IN PETROL AND DIESEL PRICES PRV

Petrol and Diesel: పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి కరోనా టీకాలకు డబ్బులు రాబడుతున్నాం.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి రామేశ్వర్​ (Photo: ANI/twitter)

కేంద్ర మంత్రి రామేశ్వర్​ (Photo: ANI/twitter)

ఇప్పటికే కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడు మాత్రం పెరుగుతున్న ఇంధన ధరలతో కుదేలయిపోతున్నాడు. అయితే పెట్రోల్​, డీజిల్​ ధరల (Petrol and diesel prices) పెరుగుదలపై పెట్రోలియం, సహజవాయువుల శాఖ కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి (Union MoS (Petroleum & Natural Gas) Rameswar Teli ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా లీటర్​ పెట్రోల్​ రూ 110 దాటేసి ఆల్​టైమ్​ రికార్డు నమోదుచేసింది. చాలారోజులుగా పెట్రోల్, డీజిల్​లను జీఎస్టీ (GST) పరిధిలోకి తేవాలంటూ ప్రజలు గోడు వెల్లబోసుకుంటున్నా.. కేంద్రం (center) మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పెట్రోల్​, డీజిల్​లపై పన్ను (tax) రూపంలో వచ్చే ఆదాయం కేంద్రానికి చాలా అవసరం. ఈ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్రం భారీ మొత్తంలో ఆదాయం (Income) కోల్పోతుంది. మరోవైపు ఇప్పటికే కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడు మాత్రం పెరుగుతున్న ఇంధన ధరలతో కుదేలయిపోతున్నాడు. అయితే పెట్రోల్​, డీజిల్​ ధరల (Petrol and diesel prices) పెరుగుదలపై పెట్రోలియం, సహజవాయువుల శాఖ కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి (Union MoS (Petroleum & Natural Gas) Rameswar Teli ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు కోవిడ్​ టీకాలకు మీరెవరూ డబ్బులివ్వట్లేదు కదా.. అందుకే పెట్రోల్​, డీజిల్​ ధరల నుంచి డబ్బులు రాబడుతున్నాం. ఒక లీటరు పెట్రోల్ కంటే ఒక లీటరు హిమాలయ నీరు ఖరీదైనదని కూడా తేలి చెప్పారు.

టీకాల కారణంగానే..

అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికైన రామేశ్వర్ తేలి.. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సహాయ మంత్రి  (Union MoS of Petroleum & Natural Gas)గా కొనసాగుతున్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదలపై మంత్రి రామేశ్వర్ తేలిని ప్రశ్నించగా.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ‘పెట్రోల్ అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు (tax) విధించాయి. మరోపక్క ప్రభుత్వం ప్రజలందరికి కరోనా టీకాలు ఉచితంగా (free corona vaccines) అందిస్తోంది. మీరు చెల్లించకుండా టీకాలకు డబ్బు (money) ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా (vaccine) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1,200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలి కదా’ అని అన్నారు.

‘మీరు హిమాలయన్ మంచి నీళ్లు తాగాలంటే ఒక బాటిల్‌కు రూ.100 ఖర్చు పెట్టాలి. పెట్రోల్ ధర కంటే దాని ధరే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే, అందుకు తగ్గట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. మా మంత్రిత్వ శాఖ ఈ ధరల్ని నియంత్రించలేదు. అది వాణిజ్య శాఖ పరిధిలోని విషయం’ అని అన్నారు. కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికి ఇటీవల తన మంత్రిత్వ శాఖ నిధులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మళ్లించారని రామేశ్వర్ తేలి చెప్పారు. అసోం బీజేపీ అధ్యక్షుడు భాబేశ్ కలిత.. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ.. ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌లో ప్రయాణించాలని, అలాగే ప్రజలు నడక సాధన చేయాలని సూచించడం విమర్శలకు తావిచ్చింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Assam, Corona Vaccine, Diesel price, Petrol prices, TAX SAVING, Union cabinet

తదుపరి వార్తలు