#MeToo: ’మీ టూ‘ ఉద్య‌మంపై కేంద్రం ప్ర‌త్యేక క‌మిటీ..

మీ టూ ఉద్యమంపై ఇన్నాళ్లూ చూస్తూ ఉన్న కేంద్రం ఇప్పుడు ఇష్యూను సీరియ‌స్ గా తీసుకుంది. అందుకే ప్ర‌త్యేకంగా క‌మిటీ వేసింది. కేంద్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి మేన‌కాగాంధీ ఈ ఇష్యూపై క‌మిటీ వేసారు. ప్ర‌త్యేకంగా న‌లుగురు రిటైర్డ్ జ‌డ్జుల ఆధ్వ‌ర్యంలో ఈ క‌మిటీ ప‌ని చేయ‌నుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 6:16 PM IST
#MeToo: ’మీ టూ‘ ఉద్య‌మంపై కేంద్రం ప్ర‌త్యేక క‌మిటీ..
మీ టూ ఉద్యమం
  • Share this:
దేశాన్ని కుదిపేస్తున్న మీ టూ ఉద్య‌మ సెగ ఇప్పుడు కేంద్రానికి కూడా త‌గిలింది. రోజుకో హీరోయిన్ బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారంటూ గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో ఒక్కో ద‌ర్శ‌కుడు.. నిర్మాత అస‌లు రూపాల‌ను బ‌య‌ట పెడుతున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీలో శ్రీ‌రెడ్డితో మొద‌లైన ఈ ర‌చ్చ బాలీవుడ్ లో త‌ను శ్రీ ద‌త్తాతో ఊపందుకుంది. అక్క‌డ్నుంచి రాధికా ఆప్టే, కంగ‌న ర‌నౌత్, దీపిక త్యాగి, పూజాహెగ్డే, అమీరా ద‌స్తూర్.. ఇలా ఒక్క‌రేంటి అంతా ఇప్పుడు మీటూపై స్పందించారు.. స‌పోర్ట్ చేస్తున్నారు.

#Me too: బ్రేకింగ్.. ’మీ టూ‘ ఉద్య‌మంపై కేంద్రం ప్ర‌త్యేక క‌మిటీ.. Union minister Maneka Gandhi sets a special committee to hearing #MeToo cases.. #MeToo,Union minister, Maneka Gandhi, sets a special committee, to hearing, #MeToo cases,kangana,tanushree dutta,hindi cinema,మేనకా గాంధీ,స్పెషల్ కమిటీ,మీ టూ,ఉద్యమం,రాహుల్ గాంధీ,సుబ్రమణ్యస్వామి,ప్రధాని నరేంద్రమోడి,కంగన రనౌత్,తను శ్రీ దత్తా,శ్రీరెడ్డి,తెలుగు సినిమా,హిందీ సినిమా,ప్రత్యేక కమిటీ
మేనకా గాంధీ


దీనిపై ఇన్నాళ్లూ చూస్తూ ఉన్న కేంద్రం ఇప్పుడు ఇష్యూను సీరియ‌స్ గా తీసుకుంది. అందుకే ప్ర‌త్యేకంగా క‌మిటీ వేసింది. కేంద్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి మేన‌కాగాంధీ ఈ ఇష్యూపై క‌మిటీ వేసారు. ప్ర‌త్యేకంగా న‌లుగురు రిటైర్డ్ జ‌డ్జుల ఆధ్వ‌ర్యంలో ఈ క‌మిటీ ప‌ని చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మీటూ ఉద్య‌మంలో పాల్గొన్న వాళ్లు.. బాధితులు కూడా ఈ క‌మిటీ ముందుకొచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని జ‌డ్జిల ముందు చెప్పుకోవ‌చ్చు. వాటికి తగిన ప‌రిష్కారాల‌ను చూపించ‌డానికే క‌మిటీ వేసామ‌ని చెప్పారు మేన‌కా గాంధీ. దీనిపై ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


దేశంలో ఏ మ‌హిళ‌కు అన్యాయం జ‌ర‌క్కూడ‌ద‌ని.. అంద‌రినీ గౌర‌వించాల‌ని మేన‌కాగాంధీ చెప్పారు. ఇక కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాలో.. వాళ్ల‌ను ఎంత జాగ్ర‌త్తగా చూసుకోవాలో ఇప్ప‌టికైనా నేర్చుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.. నిజా నిజాలు నిర్భ‌యంగా బ‌య‌టికి రావాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసాడు.



ఇక బిజేపి ఎంపి సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కూడా దీనిపై మాట్లాడారు. ప్ర‌ధాని మోడీ కూడా ఈ ఇష్యూపై స్పందించాల‌ని కోరారు. క‌చ్చితంగా రానున్న రోజుల్లో మీ టూ ఉద్య‌మం ఇంకా తీవ్ర‌త‌రం కానుంద‌నేది ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. మ‌రి ఈ రాజ‌కీయ నాయ‌కుల ఎంట్రీ త‌ర్వాత ఇష్యూ ఇంకెంత సీరియ‌స్ కానుందో చూడాలిక‌..!

ఇది కూడా చదవండి..
Published by: Praveen Kumar Vadla
First published: October 12, 2018, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading