కేంద్రమంత్రిగా తొలిసారి తెలంగాణకు కిషన్ రెడ్డి... ఘనస్వాగతానికి బీజేపీ ఏర్పాట్లు

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా తెలంగాణకు రాబోతున్న కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

news18-telugu
Updated: June 7, 2019, 7:31 AM IST
కేంద్రమంత్రిగా తొలిసారి తెలంగాణకు కిషన్ రెడ్డి... ఘనస్వాగతానికి బీజేపీ ఏర్పాట్లు
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రమంత్రిగా ఎన్నికైన అనంతరం తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి నేడు తొలిసారిగా స్వరాష్ట్రానికి రానున్నారు. గత నెల 30 కేంద్రమంత్రి మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డిని ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న కిషన్ రెడ్డి... నేడు స్వరాష్ట్రమైన తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కిషన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణకు రానుండటంతో... ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కేంద్రమంత్రిగా స్వరాష్ట్రానికి రానున్న కిషన్ రెడ్డి... కొద్దిరోజుల పాటు బిజిబిజీగా గడపనున్నారని తెలుస్తోంది. ఈ నెల 9న ప్రధాని నరేంద్రమోదీ తిరుమల పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి కూడా అక్కడిక వెళతారని సమాచారం.

First published: June 7, 2019, 7:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading