ఏపీ రాజధాని రగడపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్

ఏపీ రాజధానిపై అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: January 2, 2020, 10:56 PM IST
ఏపీ రాజధాని రగడపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ రాజధానిపై దుమారం కొనసాగుతోంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో అమరావతి రైతులు రోడ్డెక్కారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ.. 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ రాజధానిపై అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులను ఎలా నిర్ణయిస్తారు? విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. రాజధానిపై వేసిన కమిటీల నివేదికలు బయటకు వచ్చాక దీనిపై బీజేపీ స్పందిస్తుందని.. ఆ తర్వాతే కేంద్ర హోంశాఖ అభిప్రాయం చెబుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
Published by: Shiva Kumar Addula
First published: January 2, 2020, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading