రూ. కోటిన్నర బహుమతులు అవసరమా ?... కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ప్రశ్న

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి దేశం, ప్రపంచంలోని ఆర్థిక మందగమనమే కారణమంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 26, 2019, 5:05 PM IST
రూ. కోటిన్నర బహుమతులు అవసరమా ?... కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ప్రశ్న
కేసీఆర్, కిషన్ రెడ్డి
  • Share this:
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పొంతనలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉందని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం... ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్న సీఎం కేసీఆర్... పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు విలువైన వెండి బహుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ విషయంలో నేల విడిచి సాము చేస్తోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి దేశం, ప్రపంచంలోని ఆర్థిక మందగమనమే కారణమంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆర్థికంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి వివరించారు. చైనాకు ధీటుగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరైన ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులకు తెలంగాణ ప్రభుత్వం విలువైన వెండి కానుకలు ఇచ్చిన సంగతి తెలిసిందే.


First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>